Thursday, September 19, 2024
HomeతెలంగాణJeevan Reddy: నేను మీ కోసమే పని చేసే మీ మనిషిని..

Jeevan Reddy: నేను మీ కోసమే పని చేసే మీ మనిషిని..

నిరంతరం ప్రజాసేవకే పునరంకితమైన నన్ను మళ్లీ దీవించండి అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అర్ధించారు. “నమస్తే నవనాథ పురం” కార్యక్రమానికి కొనసాగింపుగా వినూత్నరీతిలో చేపట్టిన “నమస్తే చేపూర్ ….మీ కోసం మీ జీవన్ రెడ్డి” కార్యక్రమం ఆర్మూర్ మండలంలోని చేపూర్ లో కన్నుల పండుగగా జరిగింది. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి చేపూర్ గ్రామానికి చేరుకున్న జీవన్ రెడ్డికి ఆ గ్రామ ప్రజలంతా మేళ తాళ్లాలతో అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు పెద్ద ఎత్తునతరలి వచ్చ మంగళ హారతులు పట్టి జీవన్ రెడ్డి నుదుట తిలకం దిద్ది ఆశీస్సులు అందజేశారు. పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. చేపూర్ గ్రామ ప్రజలంతా ముక్త కంఠంతో “జై కేసీఆర్, దేశ్ కీనేత కేసీఆర్, జై జీవనన్న” అన్న నినాదాలతో మారుమోగించారు. జీవన్ రెడ్డి ప్రజలతో కలిసి గ్రామమంతా కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ పేరు పేరున పలకరించి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చేపూర్ గ్రామంలో జరిగిన భారీ సభలో జీవన్ రెడ్డి తనదైన శైలిలో ప్రసంగించి చేపూర్ గ్రామ ప్రజల మనసు దోచుకున్నారు.


“నేను మీ కోసమే పనిచేసే మీ జీవన్ రెడ్డిని. నేను మీ బిడ్డను. నా జీవితం ప్రజాసేవకే అంకితం.
ఆర్మూర్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమాన్ని జోడెడ్ల లా పరుగులు పెట్టిస్తున్నా. ప్రగతి పథంలో ఆర్మూర్ పేరును చరిత్రలోనే చెరగని పేజీలా సువర్ణాక్షరాలతో లిఖిస్తా. ఆర్మూర్ నియోజకవర్గం గతంలో ఎట్లుంది?.ఇప్పుడెట్లుంది?. అభివృద్ధి జరగని పల్లె ఉందా?. సంక్షేమ పథకాలు అందని ఇల్లు ఉందా?. గౌరవ సీఎం కేసీఆర్ గారు ప్రజల పాలిట దేవుడు. తెలంగాణ వస్తే ఏమొస్తదని చేపూర్ చౌరస్తాలో నిలబడి కారుకూతలు కూసిబా సన్నాసులకు చేపూర్ గ్రామంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమమే ధీటైన సమాధానం. చేపూర్ గ్రామమంటే నాకు సెంటిమెంట్. ఎనిమిదేళ్లుగా జరుగుతున్నఅభివృద్ధి పనులతో చేపూర్ రూపురేఖలే మారిపోయాయి. గతంలో ఎప్పుడైనా ఈ అభివృద్ధి చూసారా?. ఈ గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చేయాల్సిన పనుల గురించి చెప్పడానికే నేనొచ్చా.

బీజేపీ, కాంగ్రెస్ లకు ఎప్పుడూ ఓట్లు,నోట్ల గొడవే తప్ప ప్రజా సంక్షేమం పట్టదని ఆయన ధ్వజమెత్తారు. ఈ రెండు జాతీయ పార్టీలకు ప్రజలంటే చులకన భావం ఉందన్నారు. బీఆర్ఎస్ లా ప్రజల కోసమే పనిచేసే మంచి బుద్ధి కాంగ్రెస్, బీజేపీలకు కొరవడిందన్నారు. అవి ఓటేసిన ప్రజలనే కాటేసే పార్టీలని ఆయన మండిపడ్డారు. బీఆర్ ఎస్ అంటేనే బలహీన వర్గాలు, రైతుల సంక్షేమన్నారు.
కేసీఆర్ గారి జమానా అభివృద్ధికి నమూనా అని, సబ్బండ వర్గాలన్నీ సారు,కారు,కేసీఆర్, బీఆర్ ఎస్ వైపే చూస్తున్నాయని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజలు కాంగ్రెస్, బీజేపీ నేతల మాయలో పడొద్దన్నారు. కన్న తండ్రికే తిండిపెట్టనోడు మిమ్మల్ని ఉద్దరిస్తాడా?. ఎంపీ అరవింద్ ఒక నయవంచకుడు. ఒకే కొంపలో మూడు కుంపట్లు, మూడు పార్టీలు. సొంతింటినే రచ్చకీడ్చుకున్న ఈ ప్రబుద్దులా ప్రజలకు మేలు చేసేది.
బీజేపీ ఒక విషవలయం. కాంగ్రెస్ అవినీతికి నిలయం. ఏ కాంగ్రెస్ వాడో, బీజేపీ వాడో మనకొద్దు. బీఆర్ఎస్ , జీవన్ రెడ్డే మీకు ముద్దు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ పస్కా నర్సయ్య, జడ్పీటీసీ సంతోష్, సర్పంచ్ సాయన్న, ఎంపీటీసీ బాల నర్సయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్, విడీసీ అధ్యక్షుడు రిక్కలా రాజారెడ్డి, మాజీ ఎంపీటీసీ జన్నపల్లి గంగాధర్, బీఆర్ ఎస్వీ నాయకులు షాహిద్, గంగాధర్ , నాగరాజు బీఆర్ఎస్ నాయకులు సిందుకర్ చరణ్ & శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News