జగిత్యాల జిల్లా కాంగ్రెస్లో రాజకీయ పరిమాణాలు మారుతున్నాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరికపై పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. సంజయ్ చేరిక గురించి తెలపకపోవడం, తన ప్రత్యర్ధిని పార్టీలోకి తీసుకోవడటం పట్ల జీవన్ రెడ్డి అధిష్ఠానంపై ఆగ్రహంతో ఉన్నారు.
ఎమ్మెల్సీ పదవికి కూడా..
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా యోచనలో ఉన్నట్లు, రాజకీయాలకు స్వస్తి చెప్పి, వ్యవసాయం చేసుకుంటానని సన్నిహితులతో చెప్పినట్లు సమాచరం, జీవన్ రెడ్డి అలక గురించీ తెలుసుకున్న మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ లు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇంటికి చేరి ఆయనతో మాట్లాడారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని , కాంగ్రెస్ పార్టీకి మీరు చేసిన సేవలు అమోఘం అని, మీ సేవలు రాష్ట్ర ప్రజలకూ ఎంతో అవసరం అని అన్నారు.
జోరుగా మంతనాలు..
ఉప ముఖ్యమంత్రి బట్టి, మంత్రి ఉత్తమ్ ఫోన్ లో మాట్లాడినట్లు సన్నిహితులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ కూ పెద్ద దిక్కుగా ఉన్న జీవన్ రెడ్డి రాజీనామా జిల్లాలో, రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల మాట విని రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారో.. లేక రాజీనామా చేసి, రాజకీయాలకు గుడ్ బై చెబుతారో చూడాలి