Friday, November 22, 2024
HomeతెలంగాణJeevan Reddy: నా జీవితం ఆర్మూర్ ప్రజలకే అంకితం

Jeevan Reddy: నా జీవితం ఆర్మూర్ ప్రజలకే అంకితం

పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. బంధు, మిత్రులు, అభిమానులు, బీఆర్ ఎస్ శ్రేణుల హాల్ చల్ తో ఆర్మూర్-అంకాపూర్ లోని జీవన్ రెడ్డి నివాసంలో కోలాహలం నెలకొంది. జీవన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూ అంకపూర్ గ్రామం నుంచి ఆర్మూర్ బీఆర్ఎస్ యువకులు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి సభ ప్రాంగణానికి చేరుకున్నారు. టపాసులు పేలుస్తూ, లాంగ్ లివ్ జీవనన్న, జై కేసీఆర్, దేశ్ కీ నేత కేసీఆర్, జైజై జీవనన్న నినాదాలతో బీఆర్ఎస్ యువ జనం బాజా బజంత్రీలు, డప్పుచప్పుళ్లతో సందడి చేస్తూ జీవన్ రెడ్డి కి స్వాగతం పలికారు.
ఇదే సమయంలో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, అభిమానుల మధ్య జీవన్ రెడ్డి భారీ కేక్ కట్ చేసి తన బర్త్ డే వేడుకలను తనకిష్టమైన వారి ఆశీస్సుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన అభిమానులు జీవన్ రెడ్డి ని గజ మాలలతో సత్కరించి తమ అభిమానం చాటుకున్నారు . ఆర్మూర్ నుండి అంకపూర్ వరకు జనాల తాకిడికి రోడ్లు జనసంద్రంగా మారాయి. ఎమ్మార్పీఎస్ నాయకులు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వద్దకు డప్పు చప్పులతో వచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి క్షేమాన్ని ఆకాంశిస్తూ ఆయన నివాసంలో సర్వమత ప్రార్ధనలు జరిగాయి. తన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని జీవన్ రెడ్డి మాట్లాడుతూ
నా జీవితం ఆర్మూర్ ప్రజలకే అంకితం అని భావోద్వేగానికి గురయ్యారు. తన జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దాదాపు 20,000 మందికి పైగా అభిమానులకు భోజనం ఏర్పాటు చేశారు. వచ్చిన వారందరు జీవన్ రెడ్డి ఏర్పాటు చేసిన విందుని స్వీకరించి ఆశీర్వదించి వెళ్లారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News