Sunday, July 7, 2024
HomeతెలంగాణJinnaram: కోట్ల రూపాయలతో గ్రామాల అభివృద్ధి

Jinnaram: కోట్ల రూపాయలతో గ్రామాల అభివృద్ధి

గత ప్రభుత్వాల హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన గ్రామాలను నేడు సీఎం కేసీఆర్ నాయకత్వంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. జిన్నారం మండల పరిధిలోని గడ్డపోతారం గ్రామంలో హెటిరో సంస్థ సౌజన్యంతో 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన నూతన గ్రామ పంచాయతీ భవనం, 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న ముదిరాజ్ సంఘం భవన నిర్మాణ పనులకు స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం న్యూ ల్యాండ్ పరిశ్రమ సౌజన్యంతో 21 లక్షల రూపాయల వ్యయంతో గ్రామం అవసరాల కోసం కొనుగోలు చేసిన  నూతన అంబులెన్స్ ను ప్రారంభించారు.

- Advertisement -

పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ప్రతినెల గ్రామాలకు డబ్బులు విడుదల చేస్తూ పారదర్శకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం అందించే నిధులతో పాటు ఆయా గ్రామాల పరిధిలోని పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధికి పరిశ్రమల యాజమాన్యాలు తోడ్పాటు అందించిన పట్ల ఆయన కృజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులోనూ మరింత సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, గ్రామ సర్పంచ్ ప్రకాశం చారి, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ మండల అధ్యక్షులు రాజేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News