ప్రభుత్వం రెవిన్యూ వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా చేస్తున్నదని వీఆర్ఏల క్రమబద్ధీకరణ పేరుతో ఉద్యోగాలు తీసేసిన ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ.. తహసిల్డార్ అంటేనే ప్రభుత్వం అని అత్యవసర సందర్బాలలో ఎమర్జెన్సీ సమయాలలో ముఖ్య విధులు పర్యవేక్షణ చేసేదే రెవిన్యూ శాఖలొనే పనిచేసే విఆర్ఓల వ్యవస్థను రద్దు చేశారన్నారు.
ప్రభుత్వం విఆర్ఎ లను క్రమబద్దీకరణ చేసేది కేవలం పదవ తరగతి చదివిన వారికి మాత్రమే మరి మిగితా అర్హత లేని వారి పరిస్థితి ఏంటని మిగితా వారి ఉద్యోగాలు రద్దు చేస్తారా, వారసత్వంగా వచ్చిన వారికి ఆన్యాయం జరిగే అవకాశం వుందన్నారు. తెలంగాణ వచ్చాక ఉద్యోగాలు మెరుగవుతాయి అనుకొంటే 30 వేల ఉద్యోగాలు కోల్పోతున్నామన్నారు. ధరణి లో 10 వేల అప్లికేషన్ లు పెండింగ్ లో వున్నాయని దీనికి కారణం మండల్ ఆఫీసులో సిబ్బంది కొరత వుండడమే కారణమన్నారు. ప్రమోషన్స్ లేకుండా విఆర్ఎ నుండి విఆర్ఓ నుండి ఆర్ఐ ఎలా అవుతారని వ్యవస్థలను రద్దు చేయడము వలన రెవిన్యూ శాఖలో 30 వేల ఉద్యోగాలు కోత పెడుతున్నారన్నారు.
కన్న తల్లి లాంటి రెవిన్యూ శాఖను ఇబ్బంది పేట్టి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వ్యవస్థనే కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లోపం ఏమీ లేదని, రాహుల్ గాంధీ నాయకత్వంలో పార్టీ బలోపేతం అవుతుందనిఆన్ని రకాల ఋణాలను రద్దు చేసి రైతు బందు పెట్టారన్నారు.
కమిషన్ లకు కక్కుర్తి పడి కేసీఆర్ ప్రాజెక్టులు కట్టాడన్నారు. ఈ సమావేశంలో నాయకులు చొప్పదండి ఇంచార్జ్ మేడిపల్లి సత్యం, సమద్ నవాబ్, మడుపు మోహన్, ఎండి తాజ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, అఖిల్, కుర్ర పోచయ్య, నిహాల్ అహ్మద్, దన్ను సింగ్, ఎండి చాంద్, బొబ్బిలివిక్టర్, కంకణాల అనిల్ కుమార్, పోరండ్ల రమేష్, మెతుకు కాంతయ్య,ముక్క భాస్కర్,పురుమల్ల మనోహర్, షేక్ షహన్షా, అష్రాఫ్, కుంభాల రాజ కుమార్ సలీముద్దీన్ కాంపల్లి కీర్తి కుమార్, కమల పాల్గొన్నారు.