Saturday, June 14, 2025
HomeతెలంగాణJacharla: పోలీసుల సలహాలు స్వీకరించాలి

Jacharla: పోలీసుల సలహాలు స్వీకరించాలి

వచ్చేనెల సెప్టెంబర్ 7న జరిగే గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీలు విధిగా పోలీసుల సలహాలను స్వీకరించాలని జడ్చర్ల పట్టణ సీఐ ఆదిరెడ్డి సూచించారు. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని పద్మావతి కాలనీ పార్కులో జరిగిన కాలనీ సమావేశంలో వినాయక చవితి, బోనాల నిర్వహణపై కాలనీ వాసులతో సిఐ ఆదిరెడ్డి చర్చించారు.

- Advertisement -

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల సందర్భంగా ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేసుకునే సందర్భంలో మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీలలో నిర్వహించే శాంతి సమావేశాలకు పోలీస్ అధికారులను ఆహ్వానిస్తే సమావేశాలలో శాంతి భద్రతలు, సీసీ కెమెరాల ఏర్పాటు, సైబర్ నేరాలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామని అందుకు కాలనీల ప్రజలు సహకరించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News