Thursday, July 4, 2024
HomeతెలంగాణJunior Lecturer Posts : అల‌ర్ట్ : జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ వాయిదా

Junior Lecturer Posts : అల‌ర్ట్ : జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ వాయిదా

Junior Lecturer Posts : తెలంగాణ రాష్ట్రంలో 1392 జూనియ‌ర్ లెక్చ‌ర‌ర్ పోస్టుల‌కు నోటిఫికేష‌న్ జారీ అయిన సంగ‌తి తెలిసిందే. వాస్త‌వానికి నేటి నుంచి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించాల్సి ఉంది. అయితే.. సాంకేతిక కార‌ణాల వ‌ల్ల ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణను వాయిదా వేస్తున్న‌ట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. కొత్త తేదీల‌ను సైతం ప్ర‌క‌టించింది. ఈ నెల 20 నుంచి జ‌న‌వ‌రి 10 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్న‌ట్లు చెప్పింది. అభ్యర్థులు https://www. tspsc.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

- Advertisement -

వ‌చ్చే ఏడాది జూన్ లేదా జులైలో ప‌రీక్ష‌ను నిర్వ‌హించ‌నున్నారు. 27 సబ్జెక్టుల్లో మల్టీ జోన్ 1 లో 724, మల్టీ జోన్ 2 లో 668 పోస్టులను భర్తీ చేయనున్నారు.

స‌బ్జెక్టుల వారీగా పోస్టుల వివ‌రాలు ఇవే..

అరబిక్ – 02, బోటనీ – 113, బోటనీ (ఉర్దూ మీడియం)-15, కెమిస్ట్రీ – 113, కెమిస్ట్రీ(ఉర్దూ మీడియం) – 19, సివిక్స్ – 56, సివిక్స్ (ఉర్దూ మీడియం) – 16, సివిక్స్ (మారాఠీ) – 01, కామర్స్ – 50, కామర్స్ (ఉర్దూ మీడియం) – 07, ఎకనామిక్స్ – 81, ఎకనామిక్స్ (ఉర్దూ) – 15, ఇంగ్లీష్ – 81, ఫ్రెంచ్ – 02, హిందీ – 117, హిస్టరీ- 77, హిస్టరీ (ఉర్దూ మీడియం) – 17, హిస్టరీ (మరీఠీ మీడియం) – 01, మ్యాథ్స్ – 154, మ్యాథ్స్ (ఉర్దూ మీడియం) – 09, ఫిజిక్స్ – 112, ఫిజిక్స్(ఉర్దూ మీడియం) – 18, సంస్కృతం – 10, తెలుగు – 60, ఉర్దూ – 28, జువాలజీ – 128, జువాలజీ (ఉర్దూ మీడియం) – 18

ఉమ్మ‌డి రాష్ట్రంలో 2008లో జేఎల్ నోటిఫికేష‌న్‌ను జారీ చేశారు. అనేక అవాంత‌రాల త‌రువాత 2012లో ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేశారు. ఆ తర్వాత మళ్లీ జేఎల్‌ పోస్టుల భర్తీ జరగలేదు. దీంతో ఈ సారి పెద్ద ఎత్తున అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News