Sunday, July 7, 2024
HomeతెలంగాణTS Govt Jobs : తెలంగాణలో1147 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేష‌న్‌

TS Govt Jobs : తెలంగాణలో1147 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులకు నోటిఫికేష‌న్‌

TS Govt Jobs : తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల‌కు ప్ర‌భుత్వం శుభ‌వార్త చెప్పింది. ప్ర‌భుత్వ బోధ‌నాసుప‌త్రులు, వైద్య క‌ళాశాల‌ల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. 34 విభాగాల్లో 1147 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. అర్హులైన అభ్య‌ర్థులు ఈ నెల 20 ఉద‌యం 10.30 గంట‌ల నుంచి జ‌న‌వ‌రి 5 సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవ‌చ్చు. అత్య‌ధికంగా అన‌స్థీషియా విభాగంలో 155, జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీలో 117, జ‌న‌ర‌ల్ మెడిసిన్‌లో 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

- Advertisement -

వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల ఖాళీల వివ‌రాలు..

  • అనాట‌మీ 26
  • ఫిజియాల‌జీ 26
  • పాథాల‌జీ 31
  • క‌మ్యూనిటీ మెడిసిన్(ఎస్‌పీఎం) – 23
  • మైక్రో బ‌యాల‌జీ 25
  • ఫొరెన్సిక్ మెడిసిన్, టాక్సికాల‌జీ 25
  • బ‌యోకెమిస్ట్రీ 20
  • ట్రాన్స్‌ఫ్యూజ‌న్ మెడిసిన్ 14
  • జ‌న‌ర‌ల్ మెడిసిన్ 111
  • జ‌న‌ర‌ల్ స‌ర్జ‌రీ 117
  • పీడియాట్రిక్స్ 77
  • అన‌స్థీషియా 155
  • రేడియో డ‌యాగ్నోసిస్ 46
  • రేడియేష‌న్ అంకాల‌జీ 05
  • సైకియాట్రి 23
  • రెస్పిరేట‌రి మెడిసిన్ 10
  • డెర్మ‌టాల‌జీ 13
  • ఒబెస్టిట్రిక్స్, గైన‌కాల‌జీ 142
  • అప్తామాల‌జీ 08
  • ఆర్థోపెడిక్స్ 62
  • ఈఎన్టీ 15
  • హాస్పిట‌ల్ అడ్మిన్ 14
  • ఎమ‌ర్జెన్సీ మెడిసిన్ 15
  • కార్డియాల‌జీ 17
  • కార్డియాక్ స‌ర్జ‌రీ 21
  • ఎండోక్రైనాల‌జీ 12
  • గ్యాస్ట్రో ఎంట్రాల‌జీ 14
  • న్యూరాల‌జీ 11
  • న్యూరో స‌ర్జ‌రీ 16
  • ప్లాస్టిక్ స‌ర్జ‌రీ 17
  • పీడియాట్రిక్ స‌ర్జ‌రీ 08
  • యూరాల‌జీ 17
  • నెఫ్రాల‌జీ 10
  • మెడిక‌ల్ అంకాల‌జీ 01
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News