సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గం కేంద్రమైన జోగిపేటలో వీర హనుమాన్ జయంతి సందర్భంగా హనుమాన్ శోభాయాత్ర నియోజకవర్గ శాసనసభ్యులు చంటి క్రాంతికిరణ్ ఘనంగా ప్రారంభించారు. ఇందులో భాగంగా జోగిపేట పట్టణంలో పేరుగాంచిన మధ్యారంగం (క్లాక్ టవర్) నుండి ప్రారంభించి స్థానిక గౌని చౌరస్తా మీదుగా హనుమాన్ చౌరస్తా మీద నుండి నాందేడ్ జాతీయ రహదారి మీదుగా శోభయాత్ర శోభాయమానంగా కొనసాగింది.
హనుమాన్ శోభయాత్రలో భాగంగా భారీ హనుమాన్ విగ్రహానికి గజమాలను సమర్పించారు బజరంగదళ్ కార్యకర్తలు. హనుమాన్ శోభయాత్రలో భాగంగా ఎక్కడ చూసినా వీర హనుమాన్ శోభయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ “తెలుగు ప్రభ” తెలుగు దినపత్రిక ఎక్కడికి అక్కడ దర్శనం ఇవ్వడం పట్ల స్థానికులు సైతం ఆసక్తిగా చూశారు.
హనుమాన్ శోభాయాత్ర గురించి ప్రజల్లో అవగాహన కల్పింపించేందుకు గాను “తెలుగు ప్రభ”ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఈ ఫ్లెక్సీలలో ఉన్నవిగ్రహాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానిక శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ ఫ్లెక్సీలను పూర్తిగా గమనించి, ఫ్లెక్సీలను ఎవరు ఏర్పాటు చేశారు అని బజరంగదళ్ కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ మల్లికార్జున గుప్తా, ఆందోల్ జోగిపేట మున్సిపల్ చైర్మన్ గూడెం మల్లయ్య, వైస్ చైర్మన్ ప్రవీణ్ కుమార్, మరియు కౌన్సిలర్లు పార్టీలకతీతంగా అందరూ పాలుపంచుకొని హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేశారు.