Friday, September 20, 2024
HomeతెలంగాణKhammam: తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

Khammam: తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

చాలా ఆసక్తిగా ఖమ్మం సమీకరణాలు ..

ఖమ్మం కార్పొరేషన్ 28వ డివిజన్ కార్పొరేటర్ గజ్జల విజయలక్ష్మి, గజ్జల వెంకన్న, పట్టణ సీనియర్ నాయకులు బిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. ఖమ్మం బైపాస్ రోడ్ లోని తుమ్మల క్యాంప్ ఆఫీస్ లో మాజీ మంత్రివర్యులు, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో వారు చేరారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అమిర్జహ, పట్టణ అధ్యక్షులు జావిద్, కమర్తపు మురళి, కొప్పెర ఉపేందర్, దొడ్డ నగేష్, మిక్కిలినేని మంజుల, మహిళా నాయకురాలు జ్యోతిర్మయి, పాకలపాటి విజయ నిర్మల, దుద్దుకురి వెంకటేశ్వర్లుతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News