జర్నలిస్టులపై సినీ నటుడు మంచు మోహన్ బాబు(Mohanbabu) దాడి చేసిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు తీరుకు వ్యతిరేకంగా ఫిలిం ఛాంబర్ ఎదుట సీనియర్ జర్నలిస్టులు దేవులపల్లి అమర్, తెలంగాణ మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణలతో కలిసి జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
- Advertisement -
ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుపై దాడికి పాల్పడిన మోహన్ బాబును వెంటనే పోలీసులు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఓ వీధి రౌడీలా జర్నలిస్టుపై హత్యాయత్నానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ఇంత జరిగినా ఇప్పటివరకు మోహన్ బాబు ఇంకా క్షమాపణలు చెప్పలేదని ధ్వజమెత్తారు.