Saturday, November 15, 2025
HomeతెలంగాణBy Election: జూబ్లీహిల్స్‌ బైపోల్‌పై బీజేపీ స్పెషల్‌ ఫోకస్‌.. అభ్యర్థి ఎంపికపై కమిటీ ఏర్పాటు..!

By Election: జూబ్లీహిల్స్‌ బైపోల్‌పై బీజేపీ స్పెషల్‌ ఫోకస్‌.. అభ్యర్థి ఎంపికపై కమిటీ ఏర్పాటు..!

- Advertisement -

Jubilee hills By Election: జూబ్లీహిల్స్ బై పోల్ కోసం అన్ని రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్మాగంటి సునీతను క్యాండిడేట్గా అనౌన్స్చేయగా.. అధికార కాంగ్రెస్క్యాండిడేట్సెలక్షన్పై మల్లగుల్లాలు పడుతోంది. రెండు పార్టీలతో పాటు బీజేపీ సైతం నువ్వా నేనా అంటూ బరిలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే క్యాండిడేట్సెలక్షన్ను స్పీడప్చేసింది. కమిటీలు వేసి కాలనీల్లో బూత్ మీటింగ్స్ నడిపిస్తోంది. మానిటరింగ్ కమిటీతో పార్టీ చీఫ్ రాంచందర్ రావు ప్రత్యేక సమావేశం నిర్వహించి.. ప్రస్తుతం ప్రచార వ్యూహాలు, టికెట్ రేసులో ఉన్నవారి పేర్లపై చర్చించినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్బైపోల్లో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాన్ని తెలుసుకుందాం.

అభ్యర్థి ఎంపికపై మానిటరింగ్కమిటీ..

జూబ్లీహిల్స్బైపోల్అభ్యర్థి ఎంపిక కోసం మెదక్ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, గరికపాటి మోహన్ రావు, చింతల రామచంద్రా రెడ్డి, గౌతంరావులతో మానిటరింగ్ కమిటీని వేసింది బీజేపీ అధిష్టానం. నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తోంది. బూత్ లెవల్ కమిటీలను ఏర్పాటు చేసుకుని చాపకింద నీరులా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాషాయ దళం క్యాంపెయినింగ్ను కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలు, ఇక ముందు అనుసరించాల్సిన వ్యూహాలపై మానిటరింగ్ కమిటీతో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రాంచందర్ రావు అత్యవసర భేటి అయ్యారు. బూత్ లెవల్ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలతో మమేకమయ్యేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఓటర్ నాడీ తెలుసుకుని అందుకు తగ్గట్లు ప్రణాళికలు రచిస్తున్నారు, నేపథ్యంలోనే బీజేపీ తరపున అభ్యర్థి ఎవరన్నదానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. టికెట్ కావాలంటూ ఇప్పటి వరకు రాష్ట్ర నాయకత్వానికి వచ్చిన వినతులపైనా చర్చించినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు లంకల దీపక్ రెడ్డి తనకే మళ్లీ అవకాశం ఉంటుందన్న గట్టి ధీమాతో ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా అన్ని కార్యక్రమాలు నియోజకవర్గంలో ఆయనే చూసుకుంటున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సపోర్ట్ తనకే ఉంటుందని, టికెట్ పక్కా లంకలకే అన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

గెలుపు గుర్రాలపై స్పెషల్ ఫోకస్‌..

మరోవైపు, కీర్తి రెడ్డి, ఆకుల విజయ, వీరపనేని పద్మ. ఈ ముగ్గురు మహిళా కోటాలో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కీర్తిరెడ్డి గతంలోనూ జూబ్లీహిల్స్ టికెట్ ఆశించారు. కిషన్ రెడ్డి అనుచర వర్గం కావడం, ఆర్థికంగా బలంగా ఉండటం, మహిళా కేటగిరీ వంటివి ఆమెకి కలిసి వస్తుందని అనుకుంటున్నారు. ఇప్పటికే ఆమె తన మనసులోని మాట రాష్ట్ర నాయకత్వం ముందు పెట్టినట్లు తెలుస్తోంది. టికెట్ ఆశిస్తున్న మరో మహిళా నేత ఆకుల విజయ. రాష్ట్రంలో బీసీ చూట్టే రాజకీయం నడుస్తున్న వేళ జూబ్లీహిల్స్‌లో బీసీలకు అవకాశం ఇవ్వాలనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆకుల విజయ గతంలో మహిళా మోర్చా అధ్యక్షురాలిగా పనిచేయడం, రాష్ట్ర నేతల మద్దతు ఉండటంతో టికెట్ ఇస్తారన్న ఆశలు పెట్టుకున్నారు. అధికార కాంగ్రెస్ బీసీని బరిలోకి దించాలని చూస్తోందని.. బీజేపీ నుంచి కూడా బీసీనైన తనకు సీటు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. మరో బీజేపీ మహిళా నేత వీరపనేని పద్మ కూడా టికెట్ ఇస్తే పోటీ చేస్తానంటూ విన్నవించుకున్నారు. ఓ వైపు జూబ్లీహిల్స్ లో గెలుపుకోసం వ్యూహాలు రచిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న కమలం దళం.. గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad