Jubilee Hills By Elections Campaign ends on Tomorrow: జూబ్లీహిల్స్ బైపోల్ క్యాంపెయినింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. రేపు సాయంత్రానికి ప్రచారం క్లోజ్ కానుంది. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుంది. ఈనెల 14న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ప్రచారం దాదాపు ముగింపునకు చేరుకుంది. నెలరోజులుగా పొలిటికల్ పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ సీట్ కోసం కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పోలింగ్ నవంబర్ 11న జరగగా, ప్రచారం రేపు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో 24% మైనారిటీలు, మిగిలినవారు వివిధ కులాల నుంచి.. గెలుపు కోసం 1 లక్ష ఓట్లు కీలకమని విశ్లేషకులు అంచనా. గత ఎన్నికల్లో 50% కంటే తక్కువ పోలింగ్ రికార్డు చేసిన ఈ ప్రాంతంలో ఈసారి 2 లక్షలు పోలింగ్ జరుగుతుందని ఆశిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వి.నవీన్ యాదవ్‌కు ఎంఐఎం మద్దతిస్తోంది. ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ .ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు ప్రచారంలో పాల్గొని ముస్లిం ఓట్లను ఆకర్షిస్తున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇతర నేతలు బలం. ఇందులో ముస్లిం ఓట్లు కీలకం కావడంతో అన్ని పార్టీలు ఆ వర్గంపై దృష్టి పెట్టాయి.
బీఆర్‌ఎస్ రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు..
అందరికంటే ముందుగా ప్రచారం ప్రారంభించిన బీఆర్‌ఎస్ కేటీఆర్‌తో రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా రోడ్‌షోలు చేపట్టి కాంగ్రెస్ ప్రచారాన్ని బలోపేతం చేశారు. ఈ రెండు రోజులు బైక్ ర్యాలీలపై బీఆర్‌ఎస్ దృష్టి.. షేక్‌పేట్ నుంచి బోరబండ వరకు కేటీఆర్ బైక్ ర్యాలీ జరిగింది. జనప్రియ అపార్ట్‌మెంట్ సమూహాల వద్ద ఆగి, ఓటర్లను కలిసి మద్దతు కూడగడుతున్నారు. మరోవైపు, బీజేపీ చీఫ్ రామచందర్ రావు ఎర్రగడ్డలో బ్రేక్‌ఫాస్ట్ మీట్ నిర్వహించారు. దీపక్ రెడ్డి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు. సాయంత్రం కేంద్ర మంత్రులు రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. బండి సంజయ్ రోడ్‌షోకు పోలీసుల అనుమతి ఇస్తారా లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్‌ఎస్-బీజేపీ మధ్య ఓట్ల మార్పిడి జరుగుతోందని సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాకుండా, సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో జరిపిన సమీక్షలో ప్రతి ఓటరును నేరుగా కలవాలని, స్థానిక సమస్యలకు పరిష్కార హామీలు ఇవ్వాలని సూచించారు. మూడు రోజులు జోరుగా ప్రచారం చేయాలని, పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్లను చేరాలని ఆదేశాలిచ్చారు. బీజేపీ-బీఆర్‌ఎస్ మధ్య ‘సీక్రెట్ అండర్‌స్టాండింగ్’ ఉందని, కేంద్రం ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌పై ప్రాసిక్యూషన్ అనుమతి ఆలస్యం చేస్తోందని విమర్శించారు. మొత్తానికి ఆదివారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇక, ఓటింగ్ ఎలా జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.


