Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. ఈ ఉపఎన్నికల్లో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు సైతం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడలోని నవోదయ కాలనీలోని పోలింగ్ సెంటర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాగంటి సునీత తన కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఓటు వేశారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సైతం యూసుఫ్‌గూడ ప్రభుత్వ పాఠశాలలో తన అనుచరులతో పాటు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Also Read:https://teluguprabha.net/top-stories/jubilee-hills-by-poll-updates/
షేక్‌పేట డివిజన్‌లో ఉద్రిక్తత: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియలో భాగంగా షేక్‌పేట డివిజన్‌లో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులతో కాంగ్రెస్ నేత సత్యనారాయణ వాగ్వాదానికి దిగారు. బీఆర్‌ఎస్ ఏజెంట్లను బూత్‌లోకి పంపి తనను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సత్యనారాయణకు పోలీసులు సర్దిచెప్పారు.


