Saturday, November 15, 2025
HomeTop StoriesExit polls: ఎన్నికల అధికారి కీలక ఉత్తర్వులు.. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

Exit polls: ఎన్నికల అధికారి కీలక ఉత్తర్వులు.. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం

Jubilee Hills By-Election: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌కు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు. దీంతో ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 6వ తేది ఉదయం 7 గంటల నుంచి నవంబర్ 11వ తేది సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం విధిస్తున్నట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ఇది టీవీ, రేడియో, పత్రికలు, సామాజిక మాధ్యమాలు వంటి డిజిటల్ ప్లాట్ ఫామ్స్ వంటి అన్ని సమాచార మాధ్య మాలకు వర్తిస్తుందని పేర్కొన్నారు.

- Advertisement -

కఠిన చర్యలు తప్పవు: ఈ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై ప్రజాప్రతినిధుల చట్టం-1951 లోని 126 ఏ సెక్షన్ ప్రకారం రెండేళ్ల వరకు జైలుశిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చని ఆర్వీ కర్ణన్ తెలిపారు. అలాగే 126(1)(బీ) సెక్షన్ ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల సంబంధిత సర్వేలు, అభిప్రాయ సేకరణ ఫలితాలు ఎలక్ట్రానిక్ లేదా ఇతర మాధ్యమాల్లో ప్రచురించరాదని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించాలని మీడియా సంస్థలకు సూచించారు.

మొత్తం 3.98లక్షల మంది ఓటర్లు: జూబ్లీ‌హిల్స్​ ఉపఎన్నికకు ఈ నెల 13వ తేదీన ఈసీ నోటిఫికేషన్​ విడుదల చేసింది. అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. దరఖాస్తుల దాఖలుకు ఈ నెల 21వ తేదీ వరకు అవకాశం ఉంది. జూబ్లీహిల్స్​ నియోజకవర్గంలో మొత్తం 3.98లక్షల మంది ఓటర్లు ఉన్నట్లు ఇప్పటికే ఎన్నికల సంఘం పేర్కొంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించారు. నేడో, రేపు బీజేపీ సైతం తమ అభ్యర్థిని ఖరారు చేయనున్నట్టు తెలుస్తుంది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్:

  • నామినేషన్ల స్వీకరణ ప్రారంభం : ఈ నెల 13
  • నామినేషన్ల దాఖలు చివరి రోజు : ఈ నెల 21
  • నామినేషన్ల పరిశీలన              : ఈ నెల 22
  • నామినేషన్ల ఉపసంహరణ        : ఈ నెల 24
  • పోలింగ్                               : వచ్చేనెల 11
  • కౌంటింగ్                             : వచ్చేనెల 14
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad