కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తోట లక్ష్మీకాంతరావును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర తర్వాత జుక్కల్ నియోజకవర్గ రాజకీయాలలో తనదైన ప్రత్యేక ముద్ర వేసుకుని, కాంగ్రెస్ పార్టీలోని నాయకులు కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ, నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్న ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజలకు మరింత చేరువయ్యారు. నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా టిక్కెట్టు కోసం మాజీ ఎమ్మెల్యే గంగారాం, ఎన్నారై తోట లక్ష్మి కాంతారావుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ అధిష్టానం ఎన్నారై తోట లక్ష్మీకాంతరావు వైపే మొగ్గు చూపింది. అధిష్టానం తమ అభ్యర్థిగా తోట లక్ష్మీకాంతరావును ప్రకటించగానే ఆ పార్టీ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు చేసుకున్నారు.
జుక్కల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తోట లక్ష్మీకాంతరావు పేరు ఖరారు అవ్వగానే కాంగ్రెస్ పార్టీ శ్రేణులలో కొత్త జోష్ వచ్చిందని చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్న లక్ష్మీ కాంతారావు పేరు జపిస్తున్న జనం. టికెట్ రాకతో ఒక్కసారిగా నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ భారీ సంఖ్యలో దాదాపు 300 మంది కార్యకర్తలు పలువురు సీనియర్ నాయకులు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి కేవలం తోట లక్ష్మీకాంతరావు తోనే సాధ్యమని జుక్కల్ నియోజకవర్గ ప్రజలు బలంగా నమ్ముతున్నారని, జుక్కల్ నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన నమ్మకం, ఆదరాభిమానాల వల్లనే తను బీఫామ్ అందుకున్నానని, అలాగే తనను ఆశీర్వదించి జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని అన్నారు.