టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత నందమూరి తారక రామారావు(NTR) 102వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్(Kalyan Ram) నివాళి అర్పించారు. తెలుగు ప్రజలకు ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు.
- Advertisement -
ఈ సందర్భంగా తన తాతను స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా భావోద్వేగ పోస్ట్ పెట్టారు. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. సదా మీ ప్రేమకు బానిసను..” అని రాసుకొచ్చారు.
