తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) పేరు పలకడంలో మరో కాంగ్రెస్ సీనియర్ నేత తడబడ్డారు. ఇటీవలే సీనియర్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupalli Krishnarao) ఎన్నికల హామీల అమలు గురించి చెబుతూ ముఖ్యంత్రి కేటీఆర్ నాయకత్వంలో అని తడబడ్డారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని సంబోధించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) స్పందిస్తూ త్వరలోనే మంత్రివర్గం నుంచి జూపల్లిని తప్పిస్తారు అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.