Friday, September 20, 2024
HomeతెలంగాణJyothakka: మాజీ మావోయిస్టు నేరెళ్ల జ్యోతి BRSలోకి

Jyothakka: మాజీ మావోయిస్టు నేరెళ్ల జ్యోతి BRSలోకి

ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీగా బి.ఆర్.ఎస్

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం శివంగలపల్లికి చెందిన మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ మాజీ సభ్యురాలు నెరేళ్ల జ్యోతి అలియాస్ జ్యోతక్క వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరింది. వేములవాడ పట్టణంలోని చల్మెడ నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీలో చేరిన ఆమెకు జడ్పీ చైర్ పర్సన్ అరుణ-రాఘవ రెడ్డి, లక్ష్మీ నరసింహా రావులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో పోలిస్తే తెలంగాణ ఉద్యమ పార్టీగా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే పార్టీగా బి.ఆర్.ఎస్ పార్టీ ప్రభుత్వం గుర్తింపు పొందిందని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయాలంటే బి.ఆర్.ఎస్ పార్టీకే సాధ్యమని భావించి, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసే గులాబీ గూటిలో చేరినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో బి.ఆర్.ఎస్ పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా సుమారు 19 ఏండ్ల పాటు మావోయిస్టు పార్టీలో జిల్లా కమిటీ సభ్యురాలిగా, తెలంగాణ ప్రెస్ ఇంచార్జ్ గా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించిన జ్యోతి ఇటీవలే పార్టీని వీడిన సంగతి తెలిసిందే.

- Advertisement -

బి ఆర్ ఎస్ లో కి భారీ చేరికలు

కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంతో పాటు మండల కేంద్రానికి చెందిన సుమారు 30 మంది యువకులు బీజేపీని వీడి బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. ధర్మారం సర్పంచ్ గున్నాల అరుణ లక్ష్మన్ వేములవాడ పట్టణంలోని బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వీరికి జడ్పీ చైర్ పర్సన్ అరుణ-రాఘవ రెడ్డి, చల్మెడ లక్ష్మీనరసింహారావులు కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో యువజన విభాగం అధ్యక్షుడు జీవన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి, చెల్మెడ లక్ష్మి నరసింహారావు గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News