Sunday, July 7, 2024
HomeతెలంగాణKadiyam Srihari: పర్యవేక్షణ లేక దెబ్బతిన్న కాలువలు

Kadiyam Srihari: పర్యవేక్షణ లేక దెబ్బతిన్న కాలువలు

చెట్లు, పొదలప కూడా తీయకపోతే ఎలా?

అశ్వారావుపల్లి రిజర్వాయర్ కుడి కాలువ పనులను పర్య వేక్షించిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బతుకమ్మ కుంట నీళ్లు ,నెల్లుట్ల చెరువు సైఫాన్, కలెక్టరేట్ దగ్గర నుండి సైఫాన్ 17.30 కి.మీ,16 ఎల్, ఓటి పాయింట్,నెల్లుట్ల ప్రధాన కాలువను సందర్శించి దిగువ భూములకు నీరు సరఫరా అయ్యే మార్గాల గురించి ఆరా తీశారు. లింగాలఘనపూర్ మండలంలోని గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించడానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఎమ్మెల్యే చర్చించారు.

- Advertisement -

కాల్వల మీదుగా తానే స్వయంగా పర్యటించి కాల్వల ప్రక్కన ఉన్న చెట్లను పొదలను, తొలగించాలన్నారు. పర్యవేక్షణ లేక కాల్వలో చెట్లు మూళ్ళ పొదలు పెరిగాయన్నారు. తుంగ తీయకుండా మట్టి తీయకుండా నీళ్లను వడలదం సరైంది కాదన్నారు. అధికారుల అలసత్వం కానీ కాంట్రాక్టర్ల అలసత్వంతో పనులు జరగక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే జనగామ పట్టణం నుండి వచ్చే డ్రైనేజీ వాటర్ ని నెల్లుట్ల చెరువులో కలవడం వల్ల కలుషితమవుతుందన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకొని చెరువు లో నీళ్లు కలుషితం కాకుండా కాపాడాలన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి రైతులను మర్చిపోయిందన్నారు. వ్యవసాయానికి కావల్సిన 24 గం. ల కరెంట్ అందించడం లేదని మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు స్థానిక జడ్పీటీసీ, ఎంపీపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, నీటి శాఖా అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News