Sunday, October 6, 2024
HomeతెలంగాణKale Yadayya: రెండో విడత గొర్ల పంపిణీ

Kale Yadayya: రెండో విడత గొర్ల పంపిణీ

చేవెళ్ల ఎమ్మెల్యే టికెట్టు నాకే, నన్ను గెలిపించండి

గొల్ల కురుమల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కలేని విధంగా గొల్ల కురుమల సంక్షేమం కోసం గొర్ల పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. రేగడి ఘణాపూర్ గ్రామంలో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. మంజూరైన 6 యూనిట్ల గొర్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్రంలో గొల్ల కురుమలు ఆర్థికంగా బలోపేతం చేయాడమే లక్షంగా దేశంలో ఎక్కడ లేని విధంగా గొర్రెల పంపిణీ కార్యక్రమాన్నికి ముఖ్యమంత్రి కెసిఆర్ శ్రీకారం చుట్టారని అన్నారు. ఈ పథకం గొర్ల కాపరుల జీవితంలో వెలుగులు నింపిందని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల్లో గుణాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించాలన్నారు. చేవెళ్ల ఎమ్మెల్యే టికెట్టు నాకే వస్తుందని ప్రజల ఆశీర్వదిస్తే మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని కోరారు. గొర్ల పంపిణీ అనంతరం గ్రామంలో కురుమ సంఘం భవనానికి భూమి పూజ చేశారు. భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, వైస్ చైర్మన్ నర్సింలు, మర్పల్లి కృష్ణారెడ్డి, రామ్ రెడ్డి, గిరిధర్ రెడ్డి, నాగార్జున రెడ్డి, రవికాంత్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి, కసిరే వెంకటేష్, గ్రామ కురుమ సంఘం అధ్యక్షులు మహేందర్, యాదయ్య, సత్తయ్య, నవీన్ ప్రభాకర్, మల్లేష్, రాజు, రవీందర్, వివిధ గ్రామాల సర్పంచులు పశు వైద్య శాఖ అధికారులు ఎండిఓ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News