తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో చేవెళ్ల శాసనసభ్యులు కాలె యాదయ్య పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ…. దశాబ్ద కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సకల జనులకు సబ్బండవర్ణాలకు అందిస్తున్న సంక్షేమ పథకాల పనితీరును ప్రజలుకు తెలిపారరు. కెసిఆర్ 14 సంవత్సరాల నిరంతర పోరాటమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిదర్శనమన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శాఖల వారీగా రోజు ఈ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు కెసిఆర్ తెలంగాణలో ప్రవేశపెట్టడం గర్వకారణం అన్నారు. ముందు చూపు ఉన్న నాయకుడు కేసీఆర్ 60 సంవత్సరాలుగా జరగని అభివృద్ధి పది సంవత్సరాలలో చేశారన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాల అమలు తీరును ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి పరిశీలించడం గర్వకారణమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు త్రాగు నీరు లేక రోడ్లపై బిందెల ప్రదర్శనలు దర్శనమిస్తు… ప్రజలు కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయన్నారు. గ్రామాల్లో త్రాగునీటి కోసం బోర్లు వేసి సర్పంచులు లక్షల రూపాయలు ఖర్చుచేశరన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందించిన ఘనత కేసీఆర్ అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏళ్లుగా ప్రాజెక్టులు పూర్తి కాలేవని తెలంగాణ వచ్చాక కాలేశ్వరం ప్రాజెక్టు పూర్తిచేసి చెరువులు కుంటలు నిండాయన్నారు. వృద్ధులకు వికలంగులకు వితంతు ఒంటరి మహిళలకు ఎయిడ్స్ బోధకాల బాధితులకు బీడీ గీత చేనేత కార్మికులకు పెన్షన్ అమలు చేస్తున్నామన్నారు. ఆడబిడ్డల కష్టాలు తెలిసిన కెసిఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. మిషన్ భగీరథ దళిత బంధు కేసీఆర్ కిట్టు అంబులెన్స్ సేవలు పక్షపాతం లేకుండా రాష్ట్రంలో కంటి వెలుగు పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ త్వరలో గృహలక్ష్మి పథకం అమలు చేస్తారని ఈ పథకం ద్వారా వారికి లక్షా రెండు లక్షలు మూడు లక్షలు చొప్పున అందిస్తారన్నారు. పేద పిల్లలు చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ కళాశాలలు బిసి పిల్లలు చదువుకోవడానికి జ్యోతిరావు పూలే స్కూల్స్ మైనారిటీ స్కూల్స్ ఏర్పాటు చేశారన్నారు. దశాబ్ద కాలంలో సబబండవర్ణాలకు సకల సంక్షేమ పథకాల అందించిన ఘనత కేసిఆర్ ది అడుతున్నారు. నియోజకవర్గంలో శంకర్పల్లి కొండకల్లు రైల్వే కోచ్ షాబాద్ చందన్వెల్లి లో బహుళ జాతి కంపెనీల ఎం ఎల్ సి మహేందర్ రెడ్డి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఐదు మండలాల ఎంపీపీలు జడ్పిటిసిలు సర్పంచులు మార్కెట్ కమిటీ చైర్మన్ లు మండల అధ్యక్షులు ఆర్డీవో వేణుమాధవరావు ఐదు మండలాల తహసీల్దార్ లు ఎంపీడీవోలు ఎంపీలు వ్యవసాయ శాఖ అధికారులు సంబంధిత అన్ని శాఖల అధికారులు ప్రజలు పాల్గొన్నారు.