తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గొల్ల కురుమల సాధికారత సాధించడం కోసం గొల్ల కురుమలు తమ స్వశక్తితో ఆర్థిక స్వావలంబనను సాధించడం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా శంకర్ పల్లి మండలం టంగుటూరు గ్రామం లో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య లబ్ధిదారులకు స్వయంగా 18 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బండ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పథకాలు దేశంలోనే ఎక్కడా లేవని ఆయన స్పష్టం చేశారు. దేశం అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్ పల్లి మున్సిపల్ చైర్ పర్సన్ సాతా విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ పిఎసిఎస్సి చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ పాపారావు టంగటూర్ గ్రామ సర్పంచ్ ఆకమ్ గళ్ళ గోపాల్ గొల్ల కురుమ సంఘ సభ్యులు గంజాయి మల్లేష్, వెంకటేశం, రమేష్, శ్రీకాంత్, రామ్ చందర్ ,శంకర్, రాములు ,మల్లేష్ ,బన్నీ, ప్రవీణ్ కుమార్ ,రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.