Sunday, October 6, 2024
HomeతెలంగాణKale Yadayya: బి.ఆర్.ఎస్ లోకి భారీగా చేరికలు

Kale Yadayya: బి.ఆర్.ఎస్ లోకి భారీగా చేరికలు

శంకర్ పల్లి మున్సిపాలిటీలో 'కారెక్కిన' రాజకీయాలు

శంకర్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని జూలకంటి కృష్ణారెడ్డి గార్డెన్లో నిర్వహించిన సమావేశంలో బుల్కపుర్ లోని 4 వ వర్డు 5 వ వర్డు కు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీ లకు చెందిన పలువురు 150 మంది కార్యకర్తలు  బిఆర్ఎస్ గూటికి చేరారు. వారిని ఎమ్మెల్యే కాలే యాదయ్య  గులాబీ కండువా కప్పి పార్టీలోని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న  అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై రాబోయే రోజుల్లో భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరికలు ఉంటాయన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని పేద తల్లిదండ్రులకు తమ కూతురి వివాహం ఎంతో పెను భారంగా ఉన్న పరిస్థితు లలో కుటుంబ పెద్దన్నగా కళ్యాణ లక్ష్మి ముస్లిం ఆడపడుచులకు షాది ముబారక్ వంటి పథకాలను ప్రవేశపెట్టారని రైతులకు ఎకరాకు 5000 రూపాయలు చొప్పున రెండు దఫాలుగా సంవత్సరానికి 10000 రూపాయలు మరియు రైతు బీమా రైతు, రుణమాఫీ ఇచ్చి రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తున్నారని అన్నారు.

- Advertisement -

రాజశేఖర్ రెడ్డి హయాంలో వృద్ధులకు, వితంతువులకు 200 రూపాయలు ఇస్తే కెసిఆర్ గారు దాన్ని పదింతలు పెంచి 2016 రూపాయలు ఇచ్చి కుటుంబ పెద్దదిక్కై నిలిచారన్నారు. ఇంటింటికి స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తూ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తున్నారన్నారు. దేశ రాజకీయాలు క్రియాశీల పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్ అడుగులో అడుగులు వేసే విధంగా ఇతర పార్టీ  కార్యకర్తలు బి.ఆర్.ఎస్. వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. గ్రామాల్లో బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న కుట్రలను ప్రతి కార్యకర్త సరైన రీతిలో బుద్ది చెప్పాలన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి తోడ్పడుతున్న కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి పదవి అలంకరించారని ఆకాంక్షించారు. నా ఊపిరి ఉన్నంతవరకు చేవెళ్ల నియోజకవర్గం ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని అన్నారు.ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్నారు.

ఈ కార్యక్రమంలో మండల మున్సిపల్ చైర్ పర్సన్ సాతా విజయలక్ష్మి ప్రవీణ్ కుమార్ వైస్ చైర్మన్ భానూరి వెంకట్రాంరెడ్డి జడ్పిటిసి చేకూర్త గోవిందమ్మ గోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ మారేపల్లి పాపారావు, పిఎసిఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి ,టిఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ గోపాల్, 9వ వార్డ్ కౌన్సిలర్ చంద్రమౌళి ,14వ వార్డు శ్వేత పాండురంగారెడ్డి , బి.ఆర్.ఎస్.నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News