దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకొని చేవెళ్ల మండల కేంద్రంలో కెసిఆర్ గార్డెన్ లో మహిళా సంక్షేమ దినోత్సవం సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె పాల్గొన్నారు. సభలో వారు మాట్లాడుతూ…మహిళ రక్షణ సాధికారత సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కేసిఆర్ మహిళా పక్షపాతి మహిలోద్దారకుడు అన్నారు. తల్లీ బిడ్డల సంక్షేమమే సమాజ ప్రగతికి దోహదం చేస్తుందన్నారు. శిశు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. ఆడపిల్ల గర్భం దాల్చిక ప్రసవించే వరకు ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.
మహిళా రిజర్వేషన్ల వల్ల వారు అత్యున్నత పదవుల్లో ఉన్నారన్నారు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఒంటరి మహిళలకు పింఛన్లు అమలు చేస్తున్నమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం చేయించుకున్న మహిళలకు కేసీఆర్ కిట్ ఆడపిల్లలకు జన్మనిస్తే ప్రోత్సాహకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మరో 1000 రూపాయలు కలిపి 13 వేలు అందించారన్నారు. అమ్మఒడి కార్యక్రమం ద్వారా బియ్యం, పప్పు ఉడికించిన గుడ్డు అంగన్వాడీ కేంద్రంలో గర్భినిలు పాలిచ్చే తల్లులకు అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసిలు ఎంపిటిసిలు చైర్మన్లు అధికారులు ఆర్డీవో వేణుమాధవరావు చేవెళ్ల తాసిల్దార్ శ్రీనివాసులు వైద్య ఉన్నత అధికారులు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్స్ మహిళా సంఘాలు ప్రజప్రతినిధులు పాల్గొన్నారు.