Saturday, November 15, 2025
HomeతెలంగాణKale Yadayya: ఆరోగ్య చేవెళ్లే లక్ష్యంగా 'ఆరోగ్య రథం'

Kale Yadayya: ఆరోగ్య చేవెళ్లే లక్ష్యంగా ‘ఆరోగ్య రథం’

ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా రంజిత్ రెడ్డి ఏర్పాటు చేసిన రథం

చేవెళ్ల నియోజకవర్గం నవాబు పేట్ మండలం ఎల్లకొండ గ్రామంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన చేవెళ్ల ఆరోగ్య రధం ఎల్లకొండ గ్రామ సర్పంచ్ రావు వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య హాజరయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేవెళ్ల నియోజకవర్గం ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా మన ఎంపీ రంజిత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని కనుక గ్రామంలోని ప్రజలు అందరూ ఉచితంగా పరీక్షలు – ఉచిత ఆపరేషన్లు చేయించుకోవచ్చు అని తెలిపారు.

మందులు కూడా ఉచితంగా సరఫరా చేస్తారని తెలిపారు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నవాబు పేట్ మండల ఎంపీపీ కాలే భవాని రవికాంత్, జడ్పిటిసి కాలే జయమ్మ యాదయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ పిఎసిఎస్ కమిటీ చైర్మన్ పోలీసు రామ్ రెడ్డి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు చిట్టెపు మల్లారెడ్డి, కర్ణం రఘు ముదిరాజ్ నాయకులు ,కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad