శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే కాలే యాదయ్య. నేటి చిన్నారులే రేపటి బావి భారత పౌరులని, కానీ పిన్న వయసు నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకుంటే భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను చేరుకోగలుగుతారని చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్ నగర్ లో గల శ్రీ స్వామినారాయణ గురుకుల్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన ఓ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలె యాదయ్య ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గురుకుల నిర్వాహకులు శ్రీ సరళ్ జీవన్ దాస్ జీ స్వామి, హరివందన్ దాస్ జీ స్వామి, విశ్వదర్శన్ దాస్ జీ స్వామిజీలు ఎమ్మెల్యేకు సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గురుకుల్ స్కూల్ లీడర్ షిప్ పోటీలలో నెగ్గిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతులమీదుగా ప్రశంసా పత్రాలు అందజేసారు. విద్యార్థి-నాయకత్వ లక్షణాల ఆవశ్యకతపై ఎమ్మెల్యే కాలె యాదయ్య ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, గురుకుల్ ప్రిన్సిపల్ జి. శ్రీధర్ రావు, ఎన్.ఎస్.శ్రీనివాస్, అద్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.