తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సురక్ష దినోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…తెలంగాణ పోలీస్ అత్యుత్తమ శాంతి, భద్రతలు కాపాడుతూ దేశంలోనే ఆదర్శంగా నిలిచారన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడే టైమ్ లో శాంతి భద్రతల సమస్య, నక్సలిజం సమస్యలు పెరుగుతుందనే అపోహలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో పోలీసులు పటాపంచలు చేసి దేశంలోనే అత్యుత్తమ శాంతి భద్రతలను నెలకొల్పిడ్రు అన్నారు.
పెట్టుబడులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. పోలీస్ శాఖకు కేసీఆర్ పెద్ద ఎత్తున బడ్జెట్
కేటాయించి ఆధునిక పేట్రోలింగ్ వాహనాలు అందించారన్నారు. 100 కాల్ వ్యవస్థను పటిష్టం చేశారని పేర్కొన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి ప్రజలో విశ్వాసాన్ని పెంపొందించారన్నారు. నియామకాలలో మహిళ రిజర్వేషన్ కల్పించి ప్రతి పోలీస్ మహిళాలకు భద్రత ఏర్పాటు చేసిన షీ టీమ్స్ దేశానికి ఆదర్శప్రాయమన్నారు. రాష్టంలో గత 9 సంవత్సరాలలో క్రైమ్ రేట్ తగ్గిపోయిందన్నారు. దేశంలో సురక్షితమైన మహా నగరంగా హైదరాబాద్ అన్నారు.రాష్టంలో మోడల్ పోలీస్ స్టేషన్ల నిర్మాణం జరుగుతుందన్నారు. దేశంలో అదునాతనమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారన్నారు. దేశ వ్యాప్తంగా వినియోగిస్తున్న సిసి కేమేరాల్లో 70% మన రాష్ట్రంలో ఉన్నాయన్నారు.సీసీ కెమెరాలను పోలీస్ స్టేషన్లకు అనుసంధానం చేశారని మౌలిక వసతులు కల్పిస్తున్నరని ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం భేష్ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏ సి పి ప్రభాకర్, సి ఐ వెంకటేశ్వర్లు, ఎస్ ఐ ఆయుబ్, ఎస్ ఐ ప్రదీప్, తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజుకుమార్ పి ఏ సి ఎస్ చర్మన్ ప్రతాప్ రెడ్డి కృష రెడ్డి, వెంకటేష్, రవిందర్ శ్రీనివాస్, ఉన్నత అధికారులు పొలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.