Tuesday, May 20, 2025
HomeతెలంగాణKale Yadayya: స్పీకర్ నా ఫ్రెండ్ అంటున్న ఎమ్మెల్యే

Kale Yadayya: స్పీకర్ నా ఫ్రెండ్ అంటున్న ఎమ్మెల్యే

మాకు సహకరించండి

తెలంగాణ రాష్ట్ర మూడవ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ కు చేవెళ్ల నియోజకవర్గం బిఆర్ఎస్ ఎమ్మెల్యే కాలె యాదయ్య శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ… నేను, మీరు పవిత్ర స్నేహితులం, పవిత్ర సోదరులం అన్నారు. మీరు మేము ఒకటే సారి ఎంపీటీసీగా ఎన్నికయ్యామని నియోజకవర్గం కూడా ఒక్కటేనని ఎంపీపీగా కూడా ఒక్కటే సారి ఎన్నికయ్యామని గుర్తు చేశారు. ఆనాడు వికారాబాద్ టిక్కెట్ కోసం 4 సార్లు మీరు నేను పోటీ పడ్డామని అసెంబ్లీలో గుర్తు చేశారు. ఆరోజు స్వర్గీయ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మనకు నచ్చచెప్పిన టిక్కెట్ విషయాన్ని కూడా గుర్తు చేశారు.

- Advertisement -

తమరు మొదటి సారి నామినేషన్ వెయ్యడానికి లేట్ అవుతున్న సమయంలో మనం కలిసి బైక్ మీద పోయి నామినేషన్ వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇలా ఎన్నో విషయాలు ఉన్నాయని గుర్తు చేస్తూ… అట్టడుగు స్థాయి నుంచి మీరు అత్యున్నత స్థాయి పదవి పొందారని, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రజా ప్రస్థాన వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ప్రసాద్ కుమార్ కు ఆ స్థానం కలిపించిన ఆ భగవంతునికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. రాష్ట్ర అసెంబ్లీ పవిత్రమైందని స్పీకర్ స్థానం పవిత్రమైందని శాసన సభ్యుల హక్కుల కాలరాయకుండ సమస్యలు, విని తమకు సహకరించాలన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News