పల్లె ప్రజల ఆరోగ్య రక్షణనే దేయంగా చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి “ఆరోగ్య రథం” ప్రారంభించారని స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఊరెళ్ళ గ్రామంలో స్థానిక నాయకులతో కలిసి ఆయన ఆరోగ్య రథం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు గడ్డం రంజిత్ రెడ్డి సొంత నిధులతో పల్లె ప్రజల ఆరోగ్యమె లక్షంగా జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఆరోగ్య రధం కార్యక్రమం చేపట్టారన్నారు. ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఖర్చుతో కూడిన సేవలు ఆరోగ్య రథంలో ఉచితంగా అందిస్తున్నరన్నారు. షుగర్ రక్త మూత్రం పరీక్షలు నిర్వహించి వ్యాధి తీవ్రతను బట్టి ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షలు నిర్వహించిన అనంతరం రెండు రోజుల్లో రిపోట్లు ఇంటికే తెస్తారన్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్నవాల్లు చేవెళ్ళలోని పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తుందన్నారు.
మనిషికి ఆరోగ్యమె మహాభాగ్యమని అందరు ఆరోగ్యంపై జాగ్రత్త వహించాలన్నారు. ఆరోగ్య రథం మారుమూల గ్రామాలలో ప్రజలకు వైద్య సేవలను అందించేందుకు కృషి చేస్తానన్నారు. గ్రామంలో రెండు రోజులపాటు ఆరోగ్య రధం ఉంటుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం రైతుల పేదల పక్షపాతి అన్నారు. రానున్న ఎన్నికల్లో మూడోసారి రాష్ట ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను నియోజకవర్గంలో తనను గెలిపించాలని ప్రజలను కోరారు. పెంషన్లు రావడం లేదన్న గ్రామస్తులు ఎమ్మెల్యే మాట్లాడుతుండగా… గ్రామంలో పింఛన్లు రావడం లేదని కొంతమంది ఎమ్మెల్యేను ప్రశ్నించారు. పెన్షన్ పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నా పెన్షన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి ఎమ్మెల్యే బదులిస్తూ ఆన్లైన్ సమస్యతో పెన్షన్లు ఆగిపోయాయని పది పదిహేను రోజులలో మీ సమస్య తీరిపోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి వెంకటేశ్వర్ రెడ్డి వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్ స్థానిక సర్పంచ్ జహంగీర్ సర్పంచులు వెంకటేశం గుప్తా నర్సింలు నాగార్జున రెడ్డి నియోజకవర్గ బిఆర్ఎస్ యూత్ అధ్యక్షులు రవికాంత్ రెడ్డి బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ గౌడ్ ఏఎంసి డైరెక్టర్ శ్రీనివాస్ గౌడ్ వెంకటేష్ బిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి దండు సత్యం మైనార్టీ అధ్యక్షులు అబ్దుల్ గని చందు బిఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గడ్డమీద శేఖర్ కృష్ణ బిఆర్ఎస్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.