వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ రికార్డ్ నిర్వాహకులు రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ రికర్డ్ బుక్ వారి మెడల్, మెమెంటో, ప్రశంశా పత్రం అందజేశారు. కాళేశ్వరం జలానికి-లక్ష జనహారతి కార్యక్రమానికి ఈ ప్రత్యేక గుర్తింపు దక్కింది. కార్యక్రమం ప్రకటించగానే రంగంలోకి దిగి అధ్యయనం చేశారు వండర్ వరల్డ్ ఆఫ్ బుక్ సంస్థ ప్రతినిధులు. అధ్యయనం నిర్వాహకులు IWSR INDIA CHIEF డాక్టర్ బి.నరేందర్ గౌడ్, తెలంగాణ కో-ఆర్డినేటర్ A. గంగాధర్ లు, మంగళవారం సాయంత్రం నుండి బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు 7 మండలాల్లో పర్యటించారు. లక్షమందితో కాళేశ్వరం జలానికి లక్ష జన హారతి అనుకున్నప్పటికి కార్యక్రమంలో లక్షా 16 వేల 142 మంది పాల్గొన్నట్లు నిర్దారించింది బృందం. అందులో 65 వేల 42 మంది మహిళలు ఉండగా, 51,100 మంది పురుషులు పాల్గొన్నట్లు వెల్లడించారు నిర్వాహకులు.
మండలాల వారిగా సూర్యాపేట 19881 వారిలో పురుషులు 8625 స్త్రీలు 11,256,చివ్వేంల స్త్రీలు 10,454,పురుషులు9785,పెన్ పహాడ్ స్త్రీలు11935,8125 పురుషులు,ఆత్మకూరు ఎస్ స్త్రీలు 10156,పురుషులు9521,జాజిరెడ్డి గూడెంలో స్త్రీలు 9985 పురుషులు 8152 మంది పాల్గొన్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ప్రోగ్రాం పూర్తయ్యాక జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న నిర్వాహకులు నరేందర్ గౌడ్, గంగాధర్ లు. వేదిక మీద మంత్రి జగదీష్ రెడ్డికి ఘనంగా సన్మానం చేశారు. కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ తో పాటు కార్యక్రమాన్ని ఆసాంతం పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు హేమంత్ కేశవ్ పాటిల్ జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ . వీరిని కూడా ఘనంగా సత్కరించింది వండర్ బుక్ ఆఫ్ వరల్డ్స్.