Sunday, October 6, 2024
HomeతెలంగాణKale Yadayya: దేవరంపల్లి గ్రామంలో 'శుభోదయం'

Kale Yadayya: దేవరంపల్లి గ్రామంలో ‘శుభోదయం’

పలు అభివృద్ధి కార్యక్రమాల్లో బిజీగా ఎమ్మెల్యే

చేవెళ్ల మండలం దేవరంపల్లి గ్రామంలో స్థానిక శాసనసభ్యులు కాలె యాదయ్య శుభోదయం కార్యక్రమం చేపట్టారు. సర్పంచ్ బచ్చంగారి నరహరి రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో నెలకొన్న సమస్యలు తెలుసుకోవడానికి శుభోదయం కార్యక్రమం అని అన్నారు. గ్రామంలో గడప గడప తిరుగుతూ… గ్రామాలలో అభివృద్ధి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ… తెలంగాణరా ష్టంలో సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం అన్నారు. రాష్ట్రంలో రైతులకు సాగునీరు రైతు బంధు రైతు భీమా 24 గంటల ఉచిత విధ్యుత్ ఆడ పిల్లల పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మీ కేసీఆర్ కిట్ వృద్దులకు 2016 వికలాంగుల 4016 రూపాయల పెన్షన్ ఇస్తున్నారన్నారు. పేద విద్యార్థుల చదువులకు రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభించి వారికి సన్న బియ్యంతో పోషకాహార భోజనం అందిస్తున్నరన్నారు.

- Advertisement -

గ్రామాల్లో గత ప్రభుత్వాలు ప్రజలకు త్రాగు నీరు కూడా ఇవ్వలేదన్నారు. కెసిఆర్ పాలనలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీరు ఇచ్చారని మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ దళితుల అభ్యున్నతి కోసం దళిత బంధం ప్రవేశపెట్టారన్నారు.బీసీల కోసం లక్ష రూపాయల లోన్స్ పేద విద్యార్థులు విదేశాలలో విద్య కోసం 25 లక్షల సహాయం ఇలాంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. కానీ బిజెపి పాలిత రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు. గత పాలనలో ప్రభుత్వాలు రాష్ట్రాన్ని ఆగం చేశారని కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. సీఎం కేసీఆర్ రైతు పేదల పక్షపాతిగా మహిళల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారన్నారు. దేవరంపల్లి గ్రామ అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండిఏ నిధుల నుంచి 15 లక్షలు ఎంపీ నిధుల నుంచి 18 లక్షలు రూపాయలతో గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేశామన్నారు. సిడిపి ఎంజిఎన్ఆర్ఐ నిధులు40 లక్షలతో సిసి రోడ్ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. గ్రామాల అభివృద్ది కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో మరెన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ప్రజలకు సేవ చేయడానికి కెసిఆర్ కి ప్రజల ఆశీర్వాదం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కనీస వేతనాల చైర్మన్ నారాయణ డీసీఎంఎస్ చైర్మన్ పట్లోళ్ల కృష్ణారెడ్డి ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్ బిఆర్ఎస్ మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్ ఏఎంసి వైస్ చైర్మన్ నర్సింలు ఎంపీటీసీ పులుమామిడి వాసవి నారాయణ ఉప సర్పంచ్ మల్లేష్ రామ్ రెడ్డి గిరిధర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ గౌడ్ యూత్ మండల అధ్యక్షులు తోట చంద్రశేఖర్ మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ గని ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు రవీందర్ బీసీ సెల్ మండల అధ్యక్షులు రాములు గడ్డమీది శేఖర్ మార్కెట్ డైరెక్టర్ వెంకటేష్,అల్లాడ గ్రామ అధ్యక్షులు నరేందర్ రెడ్డి, రాఘవేందర్,గ్రామ కార్యదర్శి ఫయాజ్ వార్డ్ మెంబర్లు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News