MLC Kavitha Resignation: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఎమ్మెల్సీ పదవికి స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా చేశారు. బీఆర్‌ఎస్ పార్టీకి సైతం రాజీనామా చేసినట్లుగా తెలిపారు. మా కుటుంబాన్ని చీల్చే కుట్ర హరీష్ రావు, సంతోష్ చేశారని అన్నారు. మా అన్నను నా నుంచి దూరం చేయాలనే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
నాపై కుట్రలు జరుగుతుంటే చెల్లిగా: వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌ని నాపై ప్రచారాన్ని ఆపాలని వేడుకున్నానని కల్వకుంట్ల కవిత అన్నారు. పార్టీలో ఏం జరుగుతుందో చూడండి నాన్న అని కేసీఆర్ ని వేడుకున్నారు. నేను కూడా మీలాగానే ముఖం మీదనే మాట్లాడతానని అన్నారు. రేపు కేటీఆర్, మీపై కూడా కుట్ర జరగొచ్చు. రేవంత్ రెడ్డితో కలిసి హరీష్ ఒకే విమానంలో ప్రయాణించారు. హరీష్ రేవంత్‌కు లొంగి కుట్రలు చేస్తున్నారు. వ్యక్తిగత లబ్ధి కోరుకునే వ్యక్తులు పార్టీ నుంచి నన్ను బయటపడేశారు. పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్న కుట్రగా భావిస్తున్నట్లు కవిత తెలిపారు.
పార్టీకి వ్యతిరేకంగా పని చేయలేదు: పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదని కల్వకుంట్ల కవిత అన్నారు. సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయడం తప్పా? అని కవిత బీఆర్‌ఎస్ నేతలను ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో భూనిర్వాసితులకు అండగా నిలబడటం తప్పా? అని అన్నారు.


