Saturday, November 15, 2025
HomeతెలంగాణKavitha Fires on Harish and Santosh: నాన్నా.. అంతా వాళ్లిద్దరే చేశారు

Kavitha Fires on Harish and Santosh: నాన్నా.. అంతా వాళ్లిద్దరే చేశారు

Kalvakuntla Kavitha Fires On Harish Rao: బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన కల్వకుంట్ల కవిత .. మాజీ మంత్రి హరీశ్, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్ రావులపై విరుచుకుపడ్డారు. హరీశ్ ,సంతోష్.. రేవంత్ తో అంతర్గత ఒప్పందం కుదుర్చుకొని తమ కుటుంబాన్ని చీల్చేందుకు కుట్రపన్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు. వాళ్లిద్దరి కుట్రలను గ్రహించకపోతే..పార్టీకి నష్టమని తన సోదరుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సూచించారు. వాళ్లిద్దరిని దూరం పెట్టి పార్టీని నాన్నను కాపాడాలని కవిత కోరారు. ‘మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని’ కేసీఆర్ కు సూచించారు. బుధవారం ఆమె హైదరాబాద్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలను చర్చించిన ఆమె ఎమ్మెల్సీ పదవికీ, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మండలి స్పీకర్‌కు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖలను మీడియాకు విడుదల చేశారు.

- Advertisement -

మీడియా సమావేశంలో కవిత ఏమన్నారంటే.. ‘సీఎం రేవంత్..హరీశ్ రావు ఒకే ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లినప్పటి నుంచి నాపై కుట్రలు మొదలయ్యాయి.. ఒకే ఫ్లైట్ లో హరీశ్ తో వెళ్లారో లేదో రేవంత్ చెప్పాలి. కేసీఆర్ కుటుంబాన్ని చీల్చేందుకు పెద్ద కుట్ర జరిగింది. బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతోంది. హరీశ్ రావు సీఎం కాళ్లు మొక్కి సరెండర్ అయ్యారు. హరీశ్, రేవంత్ మధ్య అంతర్గత ఒప్పందం కుదిరింది. హరీశ్, సంతోష్ రావులను పక్కన పెడితేనే పార్టీ బతుకుతుంది. సంతోష్ వల్ల రామన్నకు చెడ్డ పేరు వస్తుంది.

ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీశ్ రావు ట్రబుల్స్ క్రియేట్ చేసి.. సాల్వ్ చేసినట్టు బిల్డప్ ఇస్తారు. 2018 ఎన్నికల్లో 25 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకు హరీశ్ రావు నిధులు ఇచ్చారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతి వల్లే డబ్బులు వచ్చాయి ఆయనకు. గజ్వేల్ లో కేసీఆర్ ను ఓడించేందుకు హరీశ్ ప్రయత్నించారు. నిజామాబాద్‌లో నన్ను ఓడించేందుకు ఎమ్మెల్యేలను హరీశ్ మ్యానేజ్ చేశారు. హరీశ్ రావు వల్లే కీలక నేతలు జగ్గారెడ్డి, విజయశాంతి, రఘునందన్ రావు, ఈటల, చెరుకు శ్రీనివాస్, విజయరామారావు వంటి వాళ్లంతా పార్టీని వీడారు. రేపు నాకు వచ్చిన పరిస్థితి కేటీఆర్ కు కూడా వస్తుంది. అందుకే కేటీఆర్‌కు జాగ్రత్తలు చెబుతున్నా. నాన్నను..పార్టీని కాపాడుకోవాలని చెబుతున్నాను. ప్రజా సమస్యలను పట్టించుకొని బీఆర్ఎస్ ను కాపాడాలి.

ఎన్నో పోరాటాలు చేశా
నాపై అక్రమ కేసులు బనాయించి తీహార్ జైల్లో పెట్టారు. తీహార్ జైల్లో ఐదున్నర నెలలు ఉన్నాను. జైలు నుంచి వచ్చాక ప్రజాక్షేత్రంలో అనేక ఉద్యమాలు చేశా. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని..మహిళా పెన్షన్ల కోసం పోరాటం చేశా. భద్రాచలం ముంపు సమస్యలపై పోరాడాను. జిల్లాల పర్యటనలో బీఆర్ఎస్ కండువానే వేసుకుని పర్యటించాను. నేను చేసేది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు ఎలా అవుతాయో? అధినాయకత్వం చెప్పాలి. హరీష్ రావు, సంతోష్ రావులు మేక వన్నె పులులు. పార్టీని, మా కుటుంబాన్ని భ్రష్టు పట్టించారు. కాళేశ్వరంలో అవినీతికి పాల్పడిందే హరీష్ రావు. సంతోష్ రావు గ్రీన్ ఛాలెంజ్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డాడు. ఇవే కాదు ఇంకా చాలా జరిగాయి. అవన్నీ మీకు చెప్పలేను.

హరీశ్, సంతోష్ పనిగట్టుకుని నాపై మీడియాలో తప్పుడు రాతలు రాయించారు. తెలంగాణ భవన్ లో ఉండే నాపై కుట్రలు జరుగుతున్నాయని మాట్లాడినా.. అయినా కేటీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎమ్మెల్సీ హోదాలో ఉన్న నాతోనే మాట్లాడకపోతే పార్టీలో ఉండే మిగిలిన సాధారణ మహిళా కార్యకర్తల పరిస్థితి ఏంటి.?.దేశంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న ఏకైక వ్యక్తి కేసీఆర్.. కేసీఆర్ నుంచే సామాజిక తెలంగాణ సిద్ధాంతాలు నేర్చుకున్నాను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడా కాబట్టే నన్ను బయటకు పంపారు.

కొత్త పార్టీ ఆలోచన లేదు
కొత్తగా పార్టీ పెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతమైతే అలాంటి ఆలోచన లేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినందుకు బాధగా ఉంది. రెండ్రోజుల పాటు ఏమీ మాట్లాడను. బతుకమ్మ పండగ సెలబ్రేట్ చేయాలనే ఉంది. కానీ ప్రస్తుతం రెండ్రోజులు ఏమీ మాట్లాడలేను’ అని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad