Jagruthi Janam Baata: తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత నేటి నుంచి ‘జాగృతి జనం బాట’లో కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మరికాసేపట్లో గన్‌పార్క్ వద్దకు కవిత చేరుకోనున్నారు. అనంతరం అమరవీరుల స్తూపానికి ఆమె నివాళులర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా తాను ఎంపీగా గెలుపొందిన నిజామాబాద్ నియోజకవర్గంలోని ఇందల్వాయికి చేరుకోనున్నారు. అక్కడ జాగృతి కార్యాలయం వద్ద ప్రజలను ఉద్దేశించి కవిత ప్రసంగించనున్నట్టుగా సమాచారం.
కొత్త పార్టీని పెట్టేందుకు సిద్ధం: జాగృతి జనం బాట’లో భాగంగా 4 నెలల పాటు ప్రజలతో మమేకమయ్యేలా కవిత తన కార్యాచరణను రూపొందించుకున్నారు. మేధావులు, ప్రజల నుంచి విలువైన సలహాలు, సూచనలు తీసుకుని తన భవిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తానని కవిత ఇప్పటికే పేర్కొన్నారు. అంతే కాకుండా ప్రజలు కోరుకుంటే కొత్త పార్టీని పెట్టేందుకు సైతం తాను సిద్ధమని కవిత ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు.


