Thursday, April 10, 2025
HomeతెలంగాణKalvakuntla Sanjay: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

Kalvakuntla Sanjay: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రైతును రాజు చేయటమే కేసీఆర్ కోరిక

రైతును రాజు చేయాలన్న కేసీఆర్ కోరిక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అందులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగా ఆశ తీరిందని రైతు సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేసే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కల్వకుంట్ల సంజయ్ కుమార్ అన్నారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవన్లో రైతుబంధు సమితి మండల అధ్యక్షులు కొమ్ముల జీవన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రైతు సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై రైతుల పట్ల టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ సంక్షేమంపై మాట్లాడారు. రైతన్నకి ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ రైతు సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేసేది తెలంగాణ ప్రభుత్వమేనని, రాబోయే ఎన్నికల్లో కూడా బిఆర్ఎస్ కు రైతులు పట్టం కట్టాలని సంజయ్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి మండల అధ్యక్షులు కొమ్మల జీవన్ రెడ్డి, జడ్పిటిసి సంధి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ కాటిపల్లి సరోజన రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు, సర్పంచులు,ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News