Saturday, April 12, 2025
HomeతెలంగాణKalvakurthi: మిత్ర ఫౌండేషన్ నూతన కమిటీ ఎన్నిక

Kalvakurthi: మిత్ర ఫౌండేషన్ నూతన కమిటీ ఎన్నిక

కొత్త సేవాదళం..

సామాజిక సేవా కార్యక్రమాలలో ప్రజలకు తమ వంతు సహకారాన్ని అందిస్తూ ప్రజల మన్నలను పొందుతున్న మిత్ర ఫౌండేషన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. మిత్ర ఫౌండేషన్ నూతన ప్రెసిడెంట్ యం. నాగరాజుగౌడ్ , వైస్ ప్రెసిడెంట్ గాదెల శ్రీధర్, కార్యదర్శిగా మాకం రమేష్, కోశాధికారిగా పుట్టోజు శ్రీకాంత్, కార్యనిర్వాక సభ్యులుగా హరీష్ నేత , రసూల్ ఖాన్, జగన్ గౌడ్, గంగాపురం శ్రీకాంత్ , పలుస నరేష్ లను ఎన్నుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు నాగరాజు గౌడు మాట్లాడుతూ మిత్ర ఫౌండేషన్ సేవలను మరింత విస్తృతం చేస్తూ ప్రజలకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని తెలిపారు.

అనంతరం మిత్ర ఫౌండేషన్ రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యెన్నం హాస్పిటల్స్ వారి సహకారంతో, ఉచిత వైద్య శిబిరాన్ని అబూబకర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ , శ్రీకాంత్ రెడ్డిలు హజరై ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి, వారు మాట్లాడుతూ మిత్ర ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు తమ వంతు సహకారం అందించడం అభినందనీయమన్నారు. రానున్న రోజులలో మిత్ర ఫౌండేషన్ సేవలు మరింత పెంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మిత్ర ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News