రైతు రుణమాఫీ పథకం ద్వారా రైతు కళ్ళల్లో ఆనందo నింపడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం అని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ఎల్లికల్ గ్రామంలోని రైతు వేదిక వద్ద వన మహోత్సవ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు అధికారులు రైతులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ సాగు చేసుకుంటున్న వ్యవసాయ భూమి వివరాలను రుణ సమాచారాన్ని సేకరించడంతో పాటు భూమి స్వార్జీ తమ ఇందిరమ్మ కాలంలో ఇచ్చిన ప్రభుత్వ భూమేనా అని అడిగి తెలుసుకున్నారు. రుణమాఫీ పట్ల రైతుల అభిప్రాయాలను తెలుసుకొని రైతుల సంతోషమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
గ్రామాలలో రుణమాఫీ పట్ల రైతులు సంబరాలు జరుపుకుంటూ సంతోషంతో సిఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ఘన స్వాగతం పలుకుతున్నారని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు రైతు రుణమాఫీ వ్యవసాయ విత్తనాలు ఎరువులను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా రైతులను కోరారు. రైతు రుణమాపీ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ కలవకుర్తి పట్టణంలోని ప్రధాన కూడళ్ళలలో బైక్ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి టపాసులు కాల్చారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.