Saturday, November 15, 2025
HomeతెలంగాణKamareddy: నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలి

Kamareddy: నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలి

కలెక్టర్ ఆశిష్ సాoగ్వాన్

వసతి గృహాల్లో విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. విద్యార్థులకు నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మైనార్టీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు.

- Advertisement -

గురుకుల వసతి గృహం ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం పేద విద్యార్థుల చదువుల కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికారాన్ని అందించాలని హెచ్చరించారు. ప్రతి విద్యార్థి రెండు మొక్కలను దత్తత తీసుకొని కాపాడాలని సూచించారు. మొక్కలతోనే మానవ మనుగడకు ఆధారం నెలకొందని ప్రతి ఒక్కరు మొక్కల పెంపకంపై శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. అనంతరం ఎల్లారెడ్డిలోని పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.

ఆయన వెంట ఆర్డిఓ ప్రభాకర్, ఎస్ సి కార్పొరేషన్ ఈడీ దయానంద్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, తాసిల్దార్ మహేందర్ , తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad