Tuesday, September 17, 2024
HomeతెలంగాణKamareddy: సీఎం కప్ క్రీడల ముగింపులో పోచారం

Kamareddy: సీఎం కప్ క్రీడల ముగింపులో పోచారం

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జిల్లా క్రీడలు, యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడల ముగింపు సమావేశం-బహుమతుల ప్రదానం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి. జెడ్పి చైర్ పర్సన్ దఫేదార్ శోభ రాజు, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ బి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ప్రజాప్రతినిధులు, అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ… గ్రామీణ క్రీడాకారులలో నెలకొన్న నైపుణ్యాలను వెలికి తీయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం కప్ క్రీడలను రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేశారన్నారు. అందుకే గ్రామీణ స్థాయిలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి గ్రామీణ క్రీడాకారులకు శిక్షణ పొందే వీలు కల్పించారన్నారు. జిల్లా నుండి 191 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపిక కావడం సంతోషమన్నారు పోచారం. విద్యార్థులు, యువతి యువకులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని, రాష్ట్ర, దేశ, అంతర్జాతీయ స్థాయిలలో జరిగే పోటీలలో మీరు విజేతలుగా నిలిచి మీ తల్లిదండ్రులకు, కామారెడ్డి జిల్లాకు మంచి పేరు తేవాలని పోచారం అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News