Saturday, November 23, 2024
HomeతెలంగాణKamareddy: ఊర్లో రెడ్డి బాగుంటే అందరూ బాగుంటారని కేసీఆర్ నమ్మకం

Kamareddy: ఊర్లో రెడ్డి బాగుంటే అందరూ బాగుంటారని కేసీఆర్ నమ్మకం

కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజా బహద్దూర్ వెంకట్ రామిరెడ్డి విద్యా పరిషత్ ట్రస్టు ఆధ్వర్యంలో పేద రెడ్డి, ఇతర విద్యార్థుల కొరకు రెడ్డి హాస్టల్, విద్యాలయం, సంక్షేమ భవనం నిర్మాణ భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, జిల్లా నాయకులు, రెడ్డి నాయకులు, బంధువులు..తదితరులు.

- Advertisement -

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కామెంట్స్:

ఒక ఊర్లో రెడ్డి బాగుంటే అందరు బాగుంటారని సీఎం కేసిఆర్ ప్రగాఢంగా విశ్వసిస్తారని, రెడ్డి ముఖ్యమంత్రులు కూడా చేయని విధంగా రెడ్డి సమాజం బాగు కోసం కేసిఆర్ కృషి చేశారన్నారు. రాజా బహద్దూర్ వెంకట్రామిరెడ్డి ట్రస్టుకు హైదరాబాద్ లో 150 కోట్ల విలువైన 15 ఎకరాల భూమి ఇచ్చారు. నిర్మాణం కోసం 10 కోట్లు నిధులు మంజూరు చేశారు. మర్రి చెన్నారెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ఉమ్మడి రాష్ట్ర రెడ్డి ముఖ్యమంత్రులు కూడా రెడ్డి సమాజం కోసం ఏమీ చేయలేదు. చాలా మంది చాలా రకాలుగా ప్రచారం చేస్తారు కానీ… రెడ్డి సమాజం బాగు కోసం అన్ని విధాల సహకరిస్తున్న కేసిఆర్ కు అండగా నిలబడాలి కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందుతున్న వారిలో రెడ్లమే అగ్ర స్థానంలో ఉంటాం, సీఎం కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న రెడ్డి బంధువులు గుండె మీద చెయ్యి వేసుకుని ఆ విషయాన్ని ఆలోచన చేయాలి. కామారెడ్డి పట్టణంలో RBVR సొసైటీ సభ్యులు అడగ్గానే పేద రెడ్డి ,ఇతర విద్యార్థుల కోసం 2 ఎకరాల భూమి కేటాయించిన స్థానిక ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారికి రెడ్డి సమాజం పక్షాన దన్యవాదాలు. పేద విద్యార్థుల చదువు కోసం RBVR సొసైటీ చేపడుతున్న ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్ లో ప్రభుత్వం నుండి మరింత సహకారం అందుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News