Thursday, January 23, 2025
HomeతెలంగాణKamareddy: ఘనంగా బతుకమ్మ సంబరాలు

Kamareddy: ఘనంగా బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్యే

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బతుకమ్మ వేడుకలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి హన్మంత్ షిండే పాల్గొని అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలోని ఆడ పడుచులు అందరు తంగేడు, టేకు, బంతి , చామంతి వంటి మొదలైన పూవులతో బతుకమ్మలను అందంగా తయారు చేశారు. అనంతరం ప్రధాన వీదులలో బతుకమ్మలను తీసుక వచ్చి డీజే పాటలతో ఆటలు ఆడి, పాటలు పాడి బతుకమ్మను భక్తి శ్రద్ధలతో పూజించి చెరువులో నిమజ్జనం చేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ఎంపీపీ అశోక్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగనాథ్ పటేల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాల్చర్ రాజు శ్రీహరి, మండల పార్టీ అధ్యక్షుడు వెంకట్రావు దేశాయ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బస్వరాజ్ పటేల్,మల్లికార్జున్ పటేల్,ఉప సర్పంచ్ నాగరాజు, నాయకులు నాల్చార్ శ్రీనివాస్, గ్రామ అధ్యక్షులు అవార్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News