Sunday, October 6, 2024
HomeతెలంగాణKamareddy: కామారెడ్డి బల్దియా అప్పు 40కోట్లు

Kamareddy: కామారెడ్డి బల్దియా అప్పు 40కోట్లు

కార్మికులకు జీతాలు చెల్లించే స్థితిలో కూడా లేదు

కామారెడ్డి పట్టణం మున్సిపల్ సర్వసభ్య సమావేశానికి హాజరై, సమావేశం అనంతరం మున్సిపల్ కార్యాలయం ఎదుట విలేకరులతో శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడారు.

- Advertisement -

ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ, కామారెడ్డి మున్సిపల్ పరిస్థితి దారుణంగా ఉందని, బల్దియా అప్పు 40 కోట్లు అని, పారిశుధ్య కార్మికులకు జీతాలు చెల్లించే స్థితిలో కూడా లేదని అన్నారు. ఇలాగే కొనసాగితే వీధి దీపాల బిల్లులు చెల్లించడం కూడా కష్టం అని అన్నారు. నేటి సమావేశంలో అందరూ కౌన్సిలర్ ల సమక్షంలో అభివృద్ధి గురించి చర్చించామని, ఇకపై కామారెడ్డి అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరు కౌన్సిలర్ కలిసి పని చేయడానికి ముందుకు వచ్చారనీ అన్నారు. అధికారులు ప్రజలను భాగస్వామ్యం చేసి ముందుకు సాగుతాం అని అన్నారు. ఆదాయ మార్గం పెంచుకొని కామారెడ్డి ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News