కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలంలో BRS కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ నియోజకవర్గ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు నాయకులు హాజరయ్యారు.
మంత్రి హరీశ్ రావు కామెంట్స్… 2001 లో నేను చిన్న పిల్లవాణ్ణి అపుడు గులాబీ జెండా పట్టుకునే వాళ్ళం.అపుడు అన్నిటికీ కరువే..అలాంటి పరిస్థితి నుంచి తెలంగాణ రాష్రం సాధించిన స్థాయికి వచ్చాం అన్నారు హరీష్. ఇపుడు వచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, సీనియర్ ఉద్యమ నాయకుల గడ్డ ఎల్లారెడ్డి నియోజక వర్గమని హరీష్ అన్నారు. 44 డిగ్రీల ఎండ లోనూ ఇంత మంది రావడమే బీఆర్ఎస్ బలానికి నిదర్శనమని, మొన్న రేవంత్ రెడ్డి పెట్టిన మీటింగ్ కు 500 మంది కూడా రాలేదన్నారు మంత్రి. అయినా కాంగ్రెస్ వాళ్లు గెలుస్తామని కలలు కంటున్నారని, కాంగ్రెస్ కు 40 -50 నియోజకవర్గాల్లో అభ్యర్థులే దిక్కు లేరు ఎలా గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ వస్తే ఏమొచ్చిందని కాంగ్రెస్ బీజేపీలు అంటున్నాయని, తెలంగాణ వస్తే ఏమొచ్చిందో ఏ పల్లెనడిగినా చెబుతుందన్నారు హరీష్.
ఈ రోజు తెలంగాణలో నీళ్ల కోసం యుద్దాలున్నాయా, డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న మహారాష్ట్ర లో మంచి నీళ్ళు పది రోజులకోసారి వస్తాయన్నారు. పూణేలాంటి నగరాల్లో కూడా ఐదారు రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చే పరిస్థితి ఉందని గుర్తు చేసిన హరీష్.. గుజరాత్ లో మహిళల పెళ్లికి కేవలం 12000 రూపాయలు సాయం చేస్తారన్నారు. మన దగ్గర కల్యాణ లక్ష్మి కింద లక్షా 116 రూపాయలు ఇస్తున్నామని, మన దగ్గర ఉన్నన్ని పథకాలు వేరే రాష్ట్రాల్లో ఉన్నాయా అని అడిగారు. మహారాష్ట్ర లో మన పథకాలు అమలు చేసేందుకు ఓ కమిటీ వేశారంటే మన పనితీరుకు కితాబు ఇచ్చినట్టేన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉన్న మహారాష్ట్ర , గుజరాత్ లో వ్యవసాయానికి ఇంకా ఆయిల్ ఇంజిన్లు నడుస్తున్నాయన్నారు. మన దగ్గర టార్చ్ లైట్ పెట్టి వెతికినా ఆయిల్ ఇంజిన్లు కనబడవని, కరెంటు సమస్యను ఆరు నెలల్లో అధిగమించింది కేసీఆర్ కాదా అన్నారు. కరెంటు గురించి జానా రెడ్డి ఎదో సవాల్ విసిరి వెనక్కి తగ్గారని, మాది ఇరిగేషన్ పాలన.. కాంగ్రెస్ హయాంలో మైగ్రేషన్ పాలన అన్నారు. కాంగ్రెస్ అబద్దాలను తిప్పి కొట్టాలని హరీష్ పిలుపునిచ్చారు.
రాష్ట్రం లోప్రతి పక్షాలు ప్రకృతి వైపరీత్యాల కన్నా దారుణంగా తయారయ్యాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోసమే పోరాడుతుంది.. అధికారం లోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ దుకాణం బంద్ అయినట్టే కనిపిస్తోందన్నారు హరీష్. బీజేపీ నేతలు కొందరు బీ ఆర్ ఎస్ వైపు మరికొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, బీజేపీ కి డిపాజిట్లు కూడా దక్కేట్టు లేవన్నారు. “గొర్రె బలంగా ఉంటే గొల్లాయనకు లాభం కేసీఆర్ కు శక్తి నిస్తే తెలంగాణకు లాభం” అంటూ.. కేసీఆర్ కు ఎల్లారెడ్డి అంటే ప్రత్యేకమైన ప్రేమన్నారు. త్వరలోనే ఎల్లారెడ్డి వచ్చి కేసీఆర్ వరాల జల్లు కురిపిస్తారన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి డబుల్ బెడ్ రూమ్ ల కోటాలో డబుల్ కోటా ఇస్తామన్నారు, మళ్లీ రాష్ట్రంలో BRS అధికారంలోకి వస్తుంది. మన గెలుపును ఎవరు ఆపలేరన్నారు మంత్రి హరీష్.