Friday, September 20, 2024
HomeతెలంగాణKangti: ఉచిత బస్ పాస్ ఉపయోగించుకోండి

Kangti: ఉచిత బస్ పాస్ ఉపయోగించుకోండి

అర్హులైన విద్యార్థులందరూ ఫ్రీ బస్ పాస్ వాడుకోండి

ఆర్టీసీ సంస్థ బస్ సర్వీసుల ద్వారా విద్యార్థుల కొరకు అనేక సేవలు అందిస్తున్నామని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే రానుపోను ఖర్చులు తగ్గుతాయని నారాయణ్ ఖేడ్ డిపో మేనేజర్ అన్నారు. కంగ్టి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నారాయణఖేడ్ డిపో మేనేజర్ మల్లేషయ్య అసిస్టెంట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ విలేజ్ బస్ ఆఫీసర్ సూర్యకాంత ఆధ్వర్యంలో ఉచిత బస్సు పాసులు అందజేశారు. ఈ సందర్భంగా సూర్యకాంత్ మాట్లాడుతూ విద్యార్థులు బస్పాసులు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించామని, ఆర్టీసీ ప్రయాణాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివిధ గ్రామాల నుండి పాఠశాలకు హాజరైయ్యే 37 మంది విద్యార్థులకు బస్సు పాసులు అందించారు. 18 సంవత్సరాల లోపు విద్యార్థినులకు 12 సంవత్సరాల విద్యార్థులకు ఈ పాసులు అందించారు. మిగిలిన విద్యార్థులు కూడా తమ బోనఫైడ్ ను తీసుకువచ్చి ఉచిత బస్సు పాసులు కోసం ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలన్నారు. ఆర్టీసీ సంస్థ చేస్తున్నటువంటి సహకారాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం విఠల్ నాయక్, విద్యార్థులు, ఉపాధ్యాయ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News