జైపూర్ మండలంలోని కాన్కూర్ గ్రామపంచాయతీని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాన్పూర్ గ్రామపంచాయతీ స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ నందు ఎంపికైనట్టు వెల్లడించారు. అందులో భాగంగా గ్రామంలోని డంపింగ్ యార్డు గ్రామ పంచాయతీ నర్సరీ పల్లె ప్రకృతి వనములు సందర్శించారు. గ్రామంలో ప్రతి ఇంటికి ఇంకుడు గుంత మరుగుదొడ్డి నిర్మించుకున్నారని శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా రోజూ పారిశుద్ధ్యమును నిర్వహిస్తున్నామని, తడి పొడి చెత్తను వేరు చేసి వర్మి కంపోస్టును గత కొన్ని సంవత్సరాలుగా తయారు చేసి పల్లె ప్రకృతి వనంలోని మొక్కలకు గ్రామపంచాయతీ నర్సరీలోని మొక్కలకు ఉపయోగిస్తున్నామని సర్పంచ్ వెంకటేశ్వర్ గౌడ్ కలెక్టర్ కి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, ఏపీవో బాలయ్య, కార్యదర్శి సురేందర్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.