Thursday, September 19, 2024
HomeతెలంగాణKanti Velugu: అంధత్వ నివారణే లక్ష్యం

Kanti Velugu: అంధత్వ నివారణే లక్ష్యం

కంటి వెలుగు కార్యక్రమం ద్వారా అంధత్వ సమస్యలు నిర్ములించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. సనత్ నగర్ నియోజకవర్గం అమీర్‌పేట‌లోని వివేకానంద కమ్యూనిటీ హాలులో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్నిరాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1500 బృందాలు టెస్ట్‌లు చేస్తాయని, అవసరమైన వారికి మందులు, కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,533 కేంద్రాల్లో కంటి వెలుగు పరీక్షలు నిర్వహించనున్నామన్నారు. గేటెడ్ కమ్యూనిటీ,అపార్ట్మెంట్ వాళ్ళు కావాలంటే జీహెచ్ ఎంసీ కి ట్విట్టర్, వెబ్ సైట్ లో రిక్వెస్ట్ పెడితే వారి దగ్గరికి కంటి వెలుగు బృందాలు వస్తాయి. ఒక్కో బృందంలో 8 మంది సిబ్బంది వుంటారు. రోజు ఒక్కో బృందం 120 నుంచి 130 మందికి పరీక్షలు చేస్తాయి.

- Advertisement -



సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News