సినిమాను తలపించే విధంగా రాత్రికి రాత్రే సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం మండలంలో కలకలం రూపించింది. వివరాల్లోకి వెళితే.. సింగరేణి మండలంలో ఎం.జి.ఎన్. ఆర్.ఈ జి ఎస్ లో సీసీ రోడ్ల కోసం రెండు కోట్ల నిధులు మంజూరయ్యాయి.
ఇందులో భాగంగా భాగ్యనగర్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని సామ్య తండా గ్రామంలో ఐదు లక్షల వ్యయంతో సిసి రోడ్డు మంజూరైన విషయం విదంతమే. దాని కాంటాక్ట్ ను మాత్రం తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించుకోవాలని ఆలోచనతో లోకల్ ఇసుకను సీసీ రోడ్డు నిర్మాణానికి ఉపయోగించి తక్కువ ఖర్చుతో సీసీ రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నారు.
ఈ క్రమంలో శనివారం రాత్రి హఠాత్తుగా కొందరు కూలీలను తీసుకొచ్చి అర్ధరాత్రి సమయంలో రోడ్డు నిర్మాణం చేపట్టడం గ్రామస్తులకు ఆశ్చర్యం కలిగించి కాంట్రాక్ట్ పై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం మట్టి రోడ్డు ఉదయాన్నే సిసి రోడ్లు కనిపించడంతో అధికారులు లేకుండా రాత్రికి రాత్రి లోకల్ ఇసుకతో నిర్మాణం చేపట్టడంపై గ్రామస్తులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని వాపోయారు. సిసి రోడ్డు నిర్మాణానికి లోకల్ ఇసుక ఉపయోగించి రోడ్డు నిర్మాణం చేపడుతున్నా స్థానిక అధికార పార్టీ నాయకులు నోరు మెదపకపోవడంపై కమీషన్లు తీసుకున్నారా అంటూ విమర్శలు వెలువెత్తుతున్నాయి.
కాంట్రాక్టు పై గతంలో ఎన్నో అభియోగాలు, నాణ్యత ప్రమాణాలు పాటించడని విమర్శలు ఉన్నాయి. మరుసటి రోజు ఉదయం సీసీ రోడ్లను లోకల్ బుగ్గవాగు ఇసుక వాడుతుండడంతో గ్రామస్తులు, యువకులు పనులను అడ్డుకొని సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడంతో, వాడి మిగిలిన ఇసుకను అక్కడ నుంచి వేరే చోట తరలించారు.
అదే క్రమంలో తెలుగుప్రభ రిపోర్టర్ సీసీ రోడ్ నిర్మాణ పనులపై సంబంధిత అధికారులకు వివరణ కోరగా మా దృష్టికి రాలేదని, నాణ్యత ప్రమాణాలు పాటించకపోతే సదరు కాంట్రాక్టు పై చర్యలు తీసుకుంటామన్నారు. అదేక్రమంలో శనివారం అర్ధరాత్రి రోడ్డు వేయడం పట్ల పలు అనుమానాలను గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. సదరు కాంట్రాక్టు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండడం వల్లే ఇష్టారాజ్యంగా చేస్తున్నారు అని గ్రామస్థులు మాట్లాడుకుంటున్నారు.
అధికార పార్టీ నాయకుడు కావడంతో అధికారులు ప్రమాణాల గురించి పట్టించుకోవడం లేదంటున్నారు. ఇలా నాసిరకంగా రోడ్లు నిర్మించడం వల్ల రోడ్డు మన్నిక పై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం క్యూరింగ్ కి నీళ్లు కూడా పోయాయడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి గతంలో వేసిన రోడ్ల నాణ్యత ప్రమాణాలు పరిశీలించి, జరుగుతున్న పనులపై అధికారుల పర్యవేక్షణలో జరిగే విధంగా చూడాలని, సదరు కాంట్రాక్టరుపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు.