Wednesday, December 18, 2024
HomeతెలంగాణKarepalli: ప్రభుత్వ టీచర్లు రారు, ప్రైవేటే దిక్కు

Karepalli: ప్రభుత్వ టీచర్లు రారు, ప్రైవేటే దిక్కు

సర్కారు బడిలో అంతే..

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మంచి విద్య బోధన అందించాలన్న లక్ష్యంతో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలన్న సంకల్పంతో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి ఈ స్కూల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులను కేటాయిస్తుంటే కారేపల్లి మండల పరిధిలోని రేగులగూడెం పంచాయతీ పరిధిలోని ప్రాథమిక పాఠశాలలో ఆ ఉపాధ్యాయుడు మాత్రం తన విధులు తాను చేయకుండా, లక్షలలో జీతం తీసుకుంటూ, ఎనిమిది వేల రూపాయలకు ప్రైవేట్ వ్యక్తిని నియమించడంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

ఇలా ప్రైవేట్ వ్యక్తులను నియమించడంతో సర్కార్ విద్య అభాసుపాలవుతుంది. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు ఖమ్మంలో ఉంటూ సంబంధిత శాఖ అధికారులను మామూలు ఇస్తూ తన సొంత పనులు చేసుకుంటూ జీతం వేలల్లో దండుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మరికొందరు ఉపాధ్యాయులు ఇలా ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉపాధ్యాయులు ఈ రకంగా ఉండడంతో గిరిజన విద్యార్థుల విద్యకు దూరమవుతున్నారని సర్కార్ విద్యను నమ్ముకున్న గిరిజన విద్యార్థుల భవిష్యత్తును ఆగం చేస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని విద్యార్ధి తల్లిదండ్రులు, వివిధ విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలపై ఎంఈఓ పర్యవేక్షణ కరువు

ప్రభుత్వ ఉపాధ్యాయులు నెల రోజుల నుంచి పాఠశాలలకు రాకుండా ప్రైవేట్ వ్యక్తిని పెట్టుకుని సర్కార్ పాఠశాలను నడుపుతుంటే మండల విద్యాశాఖ అధికారికి సమాచారం లేకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెల రోజుల నుంచి కనీసం పాఠశాలలు కూడా తనిఖీలు చేయడం లేదని స్పష్టంగా తెలుస్తుంది. ఉపాధ్యాయుడు తెలిపిన వివరణకు, ఎంఈఓ తెలుపుతున్న వివరణ పొంతన లేని సమాధానాలు.

ఎనిమిది వేలకు ఉద్యోగం చేస్తున్నాను, సార్ రాడు బడి నేనే చూసుకుంటా

ఈ క్రమంలో పాఠశాలకు వెళ్లిన విలేఖరి ఆ ప్రైవేట్ వ్యక్తిని ఇక్కడ ఏం చేస్తున్నారని అడగగా బన్సీలాల్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు నెలసరి 8 వేల రూపాయలు జీతం ఇవ్వడంతో నేను ఇక్కడ విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నానని. సార్ రాడు విద్యార్థులను నేనే చూసుకుంటానని సార్ ఎప్పుడో ఒకసారి వచ్చి సంతకం పెట్టి వెళ్తారని చెప్పడంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ రకంగా ఉపాధ్యాయులు వేల రూపాయలు జీతం తీసుకుంటూ ఇళ్లలోనే ఉంటూ ప్రైవేట్ వ్యక్తులతో పాఠశాల నడిపించడం మండలంలోని హార్ట్ టాపిక్ గా మారింది. మరి ఇప్పటికైన జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గిరిజన విద్యార్థులకు విద్యను అందించే విధానంగా చూడాలని, అదేవిధంగా ఇలాంటి ప్రభుత్వ ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News