Sunday, December 8, 2024
HomeతెలంగాణKarepalli: సింగరేణి మండల విద్యుత్ ఏఈగా సుధాకర్ రెడ్డి

Karepalli: సింగరేణి మండల విద్యుత్ ఏఈగా సుధాకర్ రెడ్డి

విద్యుత్ సమస్యలకు చెక్..

సింగరేణి మండల పరిధిలోని విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా వేవి రెడ్డి సుధాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం రూరల్ డివిజనల్ టెక్నికల్ ఏఈ గా విధులు నిర్వహిస్తూ బదిలీపై సింగరేణి మండలానికి వచ్చారు. ఇక్కడ విద్యుత్ అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ)గా విధులు నిర్వహిస్తున్న భూక్య విజయ్ కుమార్ జిల్లా విద్యుత్ స్టోర్ కి బదిలీ అయ్యారు.

- Advertisement -

ఈసందర్భంగా ఏఈ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో ఎలాంటి విద్యుత్ సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఇక్కడ గతంలో చేసిన అనుభవం వుందని, అన్ని గ్రామాల్లో ఉన్న లైన్ మెన్లను, ఇతర సిబ్బంది, సమన్వయం, సహకారంతో పకడ్బందీగా సేవలందియడానికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. భాగ్యనగర్ తండా సబ్ స్టేషన్ పరిధిలో భాగ్యనగర్ తండా గ్రామానికి సపరేట్ ఫీడర్ చేయడానికి అన్ని పరిశీలించి నివేదిక పైఅధికారులకు పంపుతామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News